
ENG vs IND: భారత్‌తో కీలక టెస్టుకు బెన్ స్టోక్స్ దూరం.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదో టెస్టు జులై 31న ప్రారంభంకానుంది. లండన్‌లోని ప్రముఖ కెన్నింగ్‌టన్ ఓవల్ మైదానం ఈ కీలక పోరుకు వేదికగా మారనుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే సిరీస్‌ను 2-2తో సమం చేసే అవకాశం ఉంది. మరోవైపు, ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్‌ను 3-1తో దక్కించుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు బుధవారం ఒక రోజు ముందుగానే ఐదో టెస్టుకు తుది జట్టును ప్రకటించింది. అయితే ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్‌కు ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక ఆల్‌రౌండర్, కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజానికి గాయం కారణంగా ఐదో టెస్టుకు దూరమయ్యాడు.
Details
ఇంగ్లండ్ విజయాల్లో స్టోక్స్ కీలక పాత్ర
ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో స్టోక్స్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 140 ఓవర్లు వేసిన స్టోక్స్, సిరీస్‌లో అత్యధికంగా 17 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో 7 ఇన్నింగ్స్‌ల్లో 304 పరుగులు చేశాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 198 బంతుల్లో 141 పరుగులు సాధించగా, అదే మ్యాచ్‌లో భారత్‌పై 5/72తో బౌలింగ్‌లోనూ కళ్ళు చెదిరే ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో ఐదో టెస్టులో ఓలీ పోప్ ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు.
Details
ఇంగ్లండ్ తుది జట్టులో నాలుగు మార్పులు
ఆల్‌రౌండర్ లియామ్ డాసన్, పేసర్లు జోఫ్రా ఆర్చర్, బ్రైడన్ కార్స్ తుది జట్టులో చోటు కోల్పోయారు. వీరి స్థానాల్లో జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జేమీ ఒవర్టన్, జోష్ టంగ్ తుది జట్టులోకి వచ్చారు. భారత్‌తో ఐదో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు ఇలా జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఒవర్టన్, జోష్ టంగ్