Ben Stokes: వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023 కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
గతేడాది జులైలో వన్డే ఫార్మాట్‌కు బెన్ స్టోక్స్ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ కు మరో 50 రోజుల ముందు అతడు తన నిర్ణయాన్ని యూటర్న్ తీసుకున్నాడు.
ఈ నెల చివర్లో న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో బెన్ స్టోక్స్ చోటు దక్కించుకున్నాడు.
వరల్డ్ కప్ కు ముందు స్టోక్స్ కు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలనే ఉద్ధేశంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతనికి ఈ సిరీస్‌లో అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది.
Details
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు ఎంపికైన ఇంగ్లండ్ జట్టు ఇదే
2011లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచులో స్టోక్స్ అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 105 వన్డేల్లో 38.98 సగటుతో 2,924 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలను బాదాడు. బౌలింగ్ విభాగంలో 74 వికెట్లను పడగొట్టాడు.
మోకాలి గాయంతో ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై తరఫున చాలా వరకూ మ్యాచ్ లకు దూరంగా ఉన్న స్టోక్స్.. యాషెస్ సిరీస్‌తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు
బట్లర్ (కెప్టెన్), మోయిన్అలీ, గుస్ అట్కిన్సన్, బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జోరూట్, జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, టోప్లీ, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.