
బ్యాట్, బాల్ ముట్టకపోయినా బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐర్లాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో అల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు.
ఈ మ్యాచ్ లో అతను ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయకుండా, బ్యాటింగ్ చేయకుండా ఏకంగా ప్రపంచ రికార్డునే సాధించాడు.
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఐర్లాండ్ పై ఇంగ్లండ్ ఆటగాళ్లు అధిపత్యం ప్రదర్శించారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా బ్యాటింగ్, బౌలింగ్ లేదా వికెట్ కీపింగ్ లేకుండా మ్యాచ్ గెలిచిన ఆటగాడిగా బెన్ స్టోక్స్ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచులో ఏమీ చేయని స్టోక్స్ కు కూడా రూ.16.41 లక్షల మ్యాచు ఫీజు అందనుంది.
Details
ఐర్లాండ్ పై ఇంగ్లండ్ విజయం
ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే ఆలౌటైంది.
ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 524 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ 208 పరుగులు, బెన్ డకెట్ 182 రన్స్ చేశారు.
రెండో ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ 362 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తరుపున జోష్ టాంగ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం మూడ్రోజుల్లోనే ఆటను ముగించారు.