
ENG vs IRE: సూపర్ సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో ఐర్లాండ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ చెలరేగిపోయాడు.
ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ కేవలం 172 పరుగులకే ఆలౌటైంది.
స్టువర్ట్ బ్రాడ్ నిప్పులు చెరిగే బంతులతో రెచ్చిపోయి ఏకంగా ఐదు వికెట్లను పడగొట్టాడు. ఐర్లాండ్ ను దారుణంగా దెబ్బతీసిన బ్రాడ్ తన కెరీర్ లో 20సార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
అదే విధంగా ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ తన టెస్టు కెరీర్‌లో రెండు సెంచరీలను నమోదు చేయగా.. ఇంగ్లాండ్ లో తనకు ఇది మొదటి సెంచరీ కావడం విశేషం.
Details
154 బంతుల్లోనే 157 పరుగులు చేసిన బెన్ డకెట్
జాక్ క్రాలీతో కలిసి బెన్ డకెట్ మొదటి వికెట్ కు 109 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అతను ఆలీ పోప్‌తో మరో సెంచరీ-ప్లస్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
2021లో న్యూజిలాండ్‌పై లార్డ్స్‌లో జరిగిన మ్యాచులో మొదటి సెంచరీ సాధించాడు. దాదాపు రెండేళ్ల తర్వాత బెన్ డకెట్ మరో సెంచరీని నమోదు చేశాడు.
ఈ మ్యాచులో బెన్ డకెట్ కేవలం 154 బంతుల్లోనే 157 పరుగులు చేసి విజృంభించాడు.
గతేడాది టెస్టు మ్యాచులలో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ గల బ్యాట్స్ మెన్ వివరాలు
98.77 - హ్యారీ బ్రూక్
97.77 - రిషబ్ పంత్
96.59 - జానీ బెయిర్‌స్టో
95.48 - బెన్ డకెట్
82.42 - ట్రావిస్ హెడ్