Page Loader
RCB vs PBKS: సొంత మైదానంలో బెంగళూరు తొలి విజయం 
విరాట్‌ మెరిసె....

RCB vs PBKS: సొంత మైదానంలో బెంగళూరు తొలి విజయం 

వ్రాసిన వారు Stalin
Mar 26, 2024
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అద్భుత (77) బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై తూఫానుల విరుచుకుపడ్డాడు. కాగా, మిగిలిన టాప్ బ్యాటర్లు పూర్తిగా విఫలమైయ్యారు. విరాట్‌ కోహ్లీ (49 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77) హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో... ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) బోణి చేసింది . చివర్లో దినేష్ కార్తీక్ 28 (నాటౌట్), మహిపాల్ లోమ్రోర్ 17 (నాటౌట్) పరుగులతో అదరగొట్టారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీయగా శామ్ కుర్రాన్, హర్షల్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది.

కోహ్లి మెరుపులు...

కోహ్లి మెరుపులు 

బెంగళూరు వికెట్లు పడుతున్న.. గెలిచిందంటే కోహ్లినే కారణం కోహ్లీ మెరుపు బ్యాటింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలుత ఒక్క రన్ అయినా చేయకముందే బెయిర్‌స్టో క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లి... తరువాత అద్భుతంగా దూసుకుపోయాడు. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో బెయిర్‌స్టో చేజారిన బంతి..బౌండరీకి వెళ్లింది. అదే ఓవర్లో కోహ్లి మరో మూడు ఫోర్లు కొట్టాడు. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (3)ను రబాడ వెనక్కి పంపినా కోహ్లి దూకుడైన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో మూడు బంతులను బౌండరీ దాటించాడు. గ్రీన్‌ (3) అవుట్ అయినా .. . రజత్‌ పటీదార్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

స్కోరుబోర్డు

పంజాబ్ స్కోరుబోర్డు

పంజాబ్‌: ధవన్‌ (సి) కోహ్లీ (బి) మ్యాక్స్‌వెల్‌ 45, బెయిర్‌స్టో (సి) కోహ్లీ (బి) సిరాజ్‌ 8, ప్రభ్‌సిమ్రన్‌ (సి) రావత్‌ (బి) మ్యాక్స్‌వెల్‌ 25, లివింగ్‌స్టోన్‌ (సి) రావత్‌ (బి) జోసెఫ్‌ 17, కర్రాన్‌ (సి) రావత్‌ (బి) యశ్‌ దయాల్‌ 23, జితేశ్‌ (సి) రావత్‌ (బి) సిరాజ్‌ 27, శశాంక్‌ (నాటౌట్‌) 21, హర్‌ప్రీత్‌ బ్రార్‌ (నాటౌట్‌) 2, ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 176/6; వికెట్ల పతనం: 1-17, 2-72, 3-98, 4-98, 5-150, 6-154; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-26-2, యశ్‌ దయాల్‌ 4-0-23-1, అల్జారీ జోసెఫ్‌ 4-0-43-1, గ్రీన్‌ 2-0-19-0, దాగర్‌ 3-0-34-0, మ్యాక్స్‌వెల్‌ 3-0-29-2.

స్కోరుబోర్డు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోరుబోర్డు

బెంగళూరు: కోహ్లీ (సి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ (బి) హర్షల్‌ 77, డుప్లెసి (సి) కర్రాన్‌ (బి) రబాడ 3, గ్రీన్‌ (సి) జితేశ్‌ (బి) రబాడ 3, పటీదార్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 18, మ్యాక్స్‌వెల్‌ (బి) హర్‌ప్రీత్‌ బ్రార్‌ 3, అనూజ్‌ రావత్‌ (ఎల్బీ) కర్రాన్‌ 11, దినేశ్‌ కార్తీక్‌ (నాటౌట్‌) 28, మహిపాల్‌ (నాటౌట్‌) 17, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 19.2 ఓవర్లలో 178/6; వికెట్ల పతనం: 1-26, 2-43, 3-86, 4-103, 5-130, 6-130; బౌలింగ్‌: సామ్‌ కర్రాన్‌ 3-0-30-1, అర్ష్‌దీప్‌ 3.2-0-40-0, రబాడ 4-0-23-2, హర్‌ప్రీత్‌ బ్రార్‌ 4-0-13-2, హర్షల్‌ పటేల్‌ 4-0-45-1, రాహుల్‌ చాహర్‌ 1-0-16-0.