
RCB vs PBKS: బెంగళూరు వర్సెస్ పంజాబ్.. టైటిల్‌ను ముద్దాడేది ఎవరో?
ఈ వార్తాకథనం ఏంటి
మూడేళ్ల క్రితమే ఐపీఎల్ బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. కానీ 18 ఏళ్లుగా లీగ్‌లో నిలకడగా పోటీ పడుతూనే ఉన్నా ఇప్పటిదాకా కప్పును ముద్దాడలేని జట్లు మాత్రం బెంగళూరు, పంజాబ్. 'ఈ సాలా కప్ నమ్‌దే' అంటూ ప్రతిసారి కొత్త ఆశలు రేపే ఆర్సీబీ, మళ్లీ అదే నినాదంతో బరిలోకి దిగింది. మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కదాన్ని కూడా గెలవలేకపోయిన బెంగళూరు.. ఈసారి మాత్రం ఏ దశలోనూ తడుపు లేకుండా ముందుకు సాగింది. మరోవైపు, 2014లో ఒక్కసారి మాత్రమే ఫైనల్ ఆడి రన్నరప్‌గా నిలిచిన పంజాబ్.. ఆ తర్వాత ఏ సీజన్‌లోనూ అంతగా రాణించలేకపోయింది.
Details
తొలిసారి కప్పు కోసం తుది పోరాటం
ప్లేఆఫ్స్‌కే చేరడం గగనంగా మారిన ఆ జట్టు.. ఈసారి శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ, లీగ్ దశలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్ బెర్త్ దక్కించుకుని ఇప్పుడు ట్రోఫీపై కన్నేసింది. లీగ్ దశలో హాట్ ఫేవరెట్‌గా భావించబడిన హైదరాబాద్ ఆశించిన స్థాయిలో రాణించలేక తొలిగెట్టే నిష్క్రమించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టయిన చెన్నై ఈసారి అట్టడుగున నిలవడం షాకే. ఢిల్లీ కూడా ఈసారి పేలవ ప్రదర్శనతో లీగ్ దశకే పరిమితమైంది. మొదట బాగా ఆడిన గుజరాత్ టైటాన్స్ చివర్లో తడబడి ఎలిమినేటర్‌లో అవుట్ అయింది. ముంబయి ఆఖరి దశలో పుంజుకున్నా.. రెండో క్వాలిఫయర్‌లో నిలవలేకపోయింది.
Details
kbL
చివరకు బెంగళూరు - పంజాబ్ మధ్యే టైటిల్ క్లాష్‌కు రంగం సిద్ధమైంది. రెండు జట్లూ సీజన్ మొత్తం నిలకడగా ఆడినవే కావడం, మొదటి కప్పు కల నెరవేర్చాలనే పట్టుదలతో ఉన్నవే కావడంతో.. హోరాహోరీ సమరం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. స్పష్టమైన ఫేవరెట్ ఎవరూ లేరు. వర్షం ఆటకు అడ్డంకి కావచ్చనప్పటికీ, రిజర్వ్ డే ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఫైనల్ తుదిఫలితాన్ని కొన్ని కీలక ఆటగాళ్ల ప్రదర్శనే నిర్ణయించనుంది. బెంగళూరులో హేజిల్‌వుడ్ ఆటతీరు అత్యంత కీలకం. గాయానికి లోనైనప్పటికీ, తిరిగి వచ్చిన తర్వాత వెంటనే ఇంపాక్ట్ చూపించిన ఆస్ట్రేలియా పేసర్.. పంజాబ్‌పై జరిగిన క్వాలిఫయర్‌లోనూ ప్రభావం చూపించాడు. కోహ్లి ఆర్సీబీ బ్యాటింగ్‌కు ప్రాణం. లీగ్ దశలో అతడి ఇన్నింగ్స్‌లు జట్టును ముందుండి నడిపించాయి.
Details
బలాబలాలు - ఎవరి పైచేయి?
పంజాబ్ వైపు చూసినట్లయితే శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్ వెన్నెముక. బుమ్రా, బౌల్ట్‌లతో కూడిన బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొంటూ క్వాలిఫయర్-2లో ఆడిన అతడి ఇన్నింగ్స్ అసాధారణం. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ తొలి ఓవర్లలో వికెట్లు తీయగల సత్తా ఉన్న పేసర్. ప్లేఆఫ్స్‌లో అతను మెరుగు ప్రదర్శన ఇవ్వకపోయినా, లీగ్ దశలో జట్టుకు బలంగా నిలిచాడు. ఫైనల్‌లో అతని ప్రారంభ స్పెల్ కీలకమవుతుంది. బ్యాటింగ్‌లో మాత్రం పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్ ఆర్య లాంటి ఓపెనర్లు, శ్రేయస్, నేహాల్, శశాంక్, స్టాయినిస్‌లతో బ్యాటింగ్ లైనప్ మేజర్‌గా ఉంది. బెంగళూరులో కోహ్లి, సాల్ట్ జోడీ శుభారంభాలు ఇస్తున్నా, మిడిలార్డర్‌లో పరిమిత ఎంపికలే ఉన్నాయి. పాటీదార్ ఎక్కువగా రాణించలేకపోతుండగా, లివింగ్‌స్టన్ ఫామ్‌లో లేడు. డేవిడ్ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి.
Details
పాటీదార్ vs శ్రేయస్ - కెప్టెన్సీలో ఎవరిది పైచేయి?
రజత్ పాటీదార్ కెప్టెన్సీ పగ్గాలను అద్భుతంగా సాగిస్తున్నాడు. అతని నాయకత్వంలో బెంగళూరు ఏ దశలోనూ ఒడిదుడుకులు లేకుండా ఫైనల్ చేరడం గమనార్హం. అయితే శ్రేయస్ మాత్రం అంతకుమించి సమర్థుడిగా నిలిచాడు. ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌గా అతనికి కెప్టెన్సీలోనూ పటుత్వం ఉంది. ఈ ఫైనల్లో సారథుల మధ్య సవాల్ కూడా ఆసక్తికరంగా మారనుంది.
Details
విరాట్‌కు ఇది చివరిదా?
2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న విరాట్ కోహ్లీ.. ఇప్పటిదాకా ఒకే జట్టుకు విశ్వాసంగా ఆడిన ఏకైక ఆటగాడు. కెప్టెన్‌గా ఎన్నో ఆశలతో ఫైనల్స్ చేరినా, ఎప్పుడూ తీరని కలగా కప్పు మిగిలిపోయింది. ఇప్పుడు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న కోహ్లికి.. ఇది కప్పు గెలిచే చివరి అవకాశం కావచ్చు. ఫార్మ్, జట్టు స్థితిగతులు అన్నీ అనుకూలంగా ఉండడంతో అభిమానుల ఆశలన్నీ ఈ ఫైనల్‌పైనే ఉన్నాయి. ఈసారి మాత్రం కోహ్లి చేతిలో ట్రోఫీ ఉంటుందా? ఆర్సీబీ ఆయనకు గిఫ్ట్‌గా టైటిల్ అందిస్తుందా?
Details
ఫైనల్‌కు అర్హత ఎలా దక్కించుకున్నారు?
ఈసారి టోర్నీలో నిలకడ చూపించిన రెండు జట్లే తుదిపోరుకు వచ్చాయి. పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బెంగళూరు కూడా అదే పాయింట్లు సాధించినా, నెట్ రన్‌రేట్‌లో వెనుకబడింది. మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్‌పై ఘనవిజయం సాధించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్‌కు చేరగా, రెండో క్వాలిఫయర్‌లో ముంబయిపై గెలిచి పంజాబ్ కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ సీజన్లో ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో 2-1తో బెంగళూరుదే ఆధిక్యం. గ్రూప్ దశలో ఒక్కో మ్యాచ్ గెలిచిన ఈ జట్లు.. క్వాలిఫయర్-1లో మళ్లీ తలపడగా, ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. ఇది ఆ జట్టుకు నాలుగో ఫైనల్ కాగా, పంజాబ్‌కు రెండోసారి తుది సమరంలో తలపడే అవకాశం