2022లో భారత్ క్రీడాకారుల చరిత్రాత్మకమైన విజయాలు
2022లో భారత మహిళ ప్లేయర్ల కోసం చారిత్రాత్మకమైన నిర్ణయాలను అమలు చేశారు. మహిళా క్రికెటర్లకు, భారత క్రికెటర్లతో సమానంతో వేతనాలను అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జేషా వెల్లడించారు. అదే విధంగా అక్టోబర్ 18న BCCI మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభించింది. WIPL మార్చి 2023లో జరగనుంది. 2022లో భారత మహిళల లాన్ బౌల్స్ టీమ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్‌వెల్త్ గేమ్స్‌లో పాల్గొంది. అనంతరం స్వర్ణ పతాకాన్ని సాధించి సత్తా చాటింది. ఒలింపిక్ విజేత మీరాబాయి కొన్ని సంవత్సరాలుగా భారతదేశం తరుపున వెయిట్ లిఫ్టర్‌గా రాణిస్తాన్నాడు. 2022 బర్మింగ్‌హామ్ చాప్టర్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో 49 కిలోల స్వర్ణ పతకం సాధించి ఔరా అనిపించాడు.
దేశంలో నంబర్‌వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా కర్మన్ కౌర్
ఏస్ షూటర్ మనుభాకర్ ఐదుబంగారు పతకాలు సాధించి, శబాష్ అనిపించుకున్నాడు. 2022 జాతీయ షూటింగ్ పోటీలో ఐదు బంగారు పతకాలను కైవసం చేసుకోవడం గమనార్హం. దేశంలో నంబర్‌వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా కర్మన్‌కౌర్ రికార్డు సృష్టించింది. అక్టోబరులో కెనడాలోని సగునేలో జరిగిన డబ్ల్యూ60 ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఈవెంట్‌లో విజయం సాధించి నంబర్ వన్ సాధించింది. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత పీటీఉష డిసెంబర్లో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలిగా ఎన్నికైంది. 2022లో గుజరాత్‌లో జరిగిన జాతీయక్రీడల్లో మునితాప్రజాపతి స్వర్ణంతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. జ్యోతియర్రాజి 61వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 12.82 సెకన్ల టైమింగ్‌తో 100 మీటర్ల హర్డిల్స్ రేసును పూర్తి చేసి రికార్డును బద్దలు కొట్టంది.