Page Loader
టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్
టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్

టీమిండియాలో రీఎంట్రీ కోసం ఐపీఎల్‌లో విజృంభించనున్న భువనేశ్వర్ కుమార్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2023
11:54 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా విజయాల్లో ఒకప్పుడు భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. గతేడాది అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన భువనేశ్వర్.. అనూహ్యంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులో భువీకి చోటు లభించకపోవ డంతో అతని కెరీర్ ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో భువనేశ్వర్ మళ్లీ టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే కచ్చితంగా ఐపీఎల్‌లో రాణించాలని లేదంటే టీమిండియాలో చోటు లభించడం కష్టమే. అయితే అతను గతంలో మెరుగ్గా రాణించి హైదరాబాద్ విజయాల్లో ప్రముఖ పాత్ర పోషించాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ మాత్రం ఐపీఎల్ కెరీర్‌లో మొత్తంగా 1406 డాట్ బాల్స్ వేశాడు. దీంతో ఐపీఎల్‌లో అత్య‌ధిక డాట్ బాల్స్ వేసిన బౌల‌ర్‌గా రికార్డ్ సృష్టించాడు.

భువనేశ్వర్

ఐపీఎల్‌లో భువనేశ్వర్ సాధించిన రికార్డులివే

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 146 మ్యాచ్ లు ఆడిన భువనేశ్వర్ 7.3 ఎకానమీతో 154 వికెట్లు తీశాడు. ఇందులో ఒక మ్యాచ్ లో 5 వికెట్లు తీసి విజృంభించాడు. ఐపీఎల్ ఆరంభ సీజ‌న్స్‌లో బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌, పూనే వారియ‌ర్స్‌కు ఆడిన భువ‌నేశ్వ‌ర్‌.. ఆ త‌ర్వాత 2014లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ అతన్ని కొనుగోలు చేసింది. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ టీమ్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా అతడు రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు తీసిన భువీ.. టీమిండియాలో రీఎంట్రీ ఇవ్వకపోయినా ఐపీఎల్ లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు.