Shubman Gill: రెండో టెస్టుకు కెప్టెన్ గిల్ దూరం.. తుది జట్టులోకి రానున్న సాయి సుదర్శన్
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను సమం చేయాలనే భారత జట్టు ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. మెడ గాయంతో కెప్టెన్ శుభమన్ గిల్ గువాహటిలో జరుగబోయే రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో యువ క్రికెటర్ సాయి సుదర్శన్‌కు ఫైనల్ జట్టులో అవకాశం దక్కనున్నట్లు ఎన్డీటీవీ సమాచారం వెల్లడించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్ సమయంలో గాయపడిన గిల్ బ్యాటింగ్‌కు దిగలేకపోయాడు. 124 పరుగుల లక్ష్య ఛేదనలో అతడి లేను లోటు స్పష్టంగా కనిపించగా, భారత్ 30 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
వివరాలు
గిల్ కి కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స
సిరీస్‌ను నిర్ణయించే రెండో మ్యాచ్ రేపటినుంచే మొదలయ్యే నేపథ్యంలో, గిల్ ఎలాగైనా ఆడాలనే పట్టుదలతో జట్టుతో పాటు గువాహటికి ప్రయాణించినా... గాయం తీవ్రతను పరిశీలించిన టీమ్ మేనేజ్‌మెంట్, అతడికి విరామం ఇవ్వడం మంచిదని నిర్ణయించింది. గిల్ తొలి టెస్టు రెండో రోజునే గాయానికి గురవ్వడంతో, వెంటనే కోల్‌కతా ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేశారు. వైద్యపరంగా స్థిరంగా ఉన్నప్పటికీ,ఐదు రోజుల టెస్టు మ్యాచ్ ఒత్తిడి గాయాన్ని మరింతగా పెంచే ప్రమాదం ఉందని వైద్యులు సూచించారు.
వివరాలు
ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు రంగ ప్రవేశం చేసిన సాయి సుదర్శన్
పీటీఐ సమాచారం ప్రకారం,గిల్ పూర్తిగా మళ్లీ ఆటకు సిద్ధం కావడానికి కనీసం పది రోజులు పట్టే అవకాశం ఉంది. మరోవైపు, గిల్ స్థానాన్ని భర్తీ చేయనున్న 24 ఏళ్ల సాయి సుదర్శన్,ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌పై టెస్టు రంగ ప్రవేశం చేశాడు. ఇప్పటివరకు ఐదు టెస్టుల్లో 30.33 సగటుతో మొత్తం 273 పరుగులు నమోదు చేసిన అనుభవం అతడికి ఉంది.