Ishan Kishan: టీమిండియాకు భారీ షాక్.. రెండో టీ20కి ఇషాన్ కిషన్ దూరం!
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్‌తో తొలి టీ20లో విజయం సాధించి శుభారంభం చేసిన టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గాయంతో రెండో టీ20కి దూరమయ్యే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించాడు. గురువారం జరిగిన తొలి టీ20లో ఇషాన్ కిషన్ గజ్జల్లో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. తొలి టీ20లో బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ పొందిన తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే, ఇషాన్ కిషన్ గాయంతో ఇబ్బంది పడటంతో అతడు తన స్థానంలో బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ఇషాన్ అసౌకర్యంగా కనిపించాడు.
వివరాలు
వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకొనే ఛాన్స్
ఇషాన్ గాయం తీవ్రంగా లేకపోయినప్పటికీ, రెండో టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. ఇషాన్ కిషన్ గజ్జల్లో నొప్పితో బాధపడుతున్నాడని తెలిపాడు.
గాయం తీవ్రత ఎక్కువగా లేకపోయినా, రెండో టీ20లో అతడు ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నాడు.
ఒకవేళ ఇషాన్ కిషన్ రెండో టీ20కి దూరమైతే యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉందని కోటక్ వెల్లడించాడు.
తొలి టీ20లో ఇషాన్ గాయంతో ఇబ్బంది పడటం వల్లే తిలక్ వర్మకు బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ లభించిందని వివరించాడు.
రెండో టీ20లో మాత్రం తిలక్ వర్మ తన సాధారణ స్థానంలోనే బ్యాటింగ్‌కు వస్తాడని స్పష్టం చేశాడు.
వివరాలు
సూపర్ ఫామ్‌లో ఇషాన్ కిషన్
రీఎంట్రీ తర్వాత ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగుతూ భారీ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు.
పునరాగమనం తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లోనే వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. ఇప్పటివరకు మొత్తం 67 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇషాన్ కిషన్ 1,955 పరుగులు సాధించాడు.
ఇందులో ఒక సెంచరీతో పాటు 13 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇలాంటి మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో గాయంతో అతడు రెండో టీ20కి దూరమయ్యే పరిస్థితి రావడం టీమిండియాకు ఎదురుదెబ్బగా మారింది.
ఇషాన్ కోలుకుని తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి వస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.