Page Loader
ఐపీఎల్ మహిళ టీం కొనుగోలుపై బడా ఫ్రాంచైసీలు ఆసక్తి..!
మహిళ టీం కొనుగోలుపై నేడు స్పష్టమైన ప్రకటన

ఐపీఎల్ మహిళ టీం కొనుగోలుపై బడా ఫ్రాంచైసీలు ఆసక్తి..!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 23, 2023
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ మహిళను టీం కొనుగోలు చేయడానికి బడా ఫ్రాంచైసీలు ఆసక్తిని చూపుతున్నాయి. ఎలాగైనా టీంను కొనుగోలు చేయాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశాయి. నేడు ఏ ఫ్రాంచైసీలు ముందుకు రానున్నాయో ఓ కొలక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు ఎంత మొత్తం పెట్టుబడి పెడుతున్నారు, ఎవరు ఆసక్తి చూపుతున్నారో నేడు తెలిసే అవకాశం ఉంటుంది. WIPL కోసం ఇన్విటేషన్ టు టెండర్ పత్రాన్నితీసుకున్న వారికి నేడు టెక్నికల్ బిడ్‌ల కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఫైనాన్షియల్ బిడ్‌లను రెండు రోజుల తర్వాత అందించాలి. ఇప్పటికే టెక్నికల్ బిడ్‌లు, ఐదు WIPL టీమ్‌లను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వాటిని జనవరి 25 ఫైనాన్షియల్ బిడ్‌ల తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

ఉమెన్స్ ఐపీఎల్

అంబానీ, అదానీలపై భారీ ఊహాగానాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి 1000 కోట్ల నికర విలువ నిబంధనను విధించింది. ఇందులో కొన్ని పెద్ద కార్పొరేట్‌లు ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచంలోని రెండు అతిపెద్ద కార్పొరేట్‌‌ లైన అంబానీలు, అదానీలపై ఇప్పటికే భారీ ఊహాగానాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ అత్యంత ధనిక ఐపీఎల్ ఫ్రాంచైజీ కావడంతో, అంబానీలు డబ్ల్యుఐపిఎల్ వేలంలో పాల్గొంటారని సమాచారం WIPL జట్లను కొనుగోలు చేయగలిగితే ఐపీఎల్ జట్టుకు ప్రయోజనం ఉంటుందని స్పష్టంగా ఉంది, అయితే సాంకేతిక బిడ్డింగ్ సందర్భంగా కొన్ని పెద్ద ఫ్రాంచైజీలు వేలానికి దూరంగా ఉండొచ్చు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు పాల్గొనే అవకాశం ఉంది.