ICC World Cup 2023 : ఘోర పరాభావం.. పాకిస్థాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా
వన్డే వరల్డ్ కప్ 2023లో దారుణంగా విఫలమైన పాకిస్థాన్ జట్టులో ఊహించనట్లుగానే మార్పులు జరుగుతున్నారు. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టును ఊహించిన షాక్ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్ని మోర్కెల్ తన బాధ్యతల నుండి తప్పకున్నాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో పాకిస్థాన్ జట్టులో కలిసిన మోర్నీ ఆరు నెలల కూడా గడవకుండానే తన బాధ్యతల నుంచి తప్పుకోవడం గమనార్హం.
చెత్త రికార్డును నమోదు చేసుకున్న హరీస్ రౌఫ్
ఇక ప్రపంచ కప్ లో తొమ్మిది మ్యాచులు లాడిన పాకిస్థాన్ నాలుగింట మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. ఇక ఈ టోర్నీలో పాకిస్థాన్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ వైఫల్యమే ఆ జట్టును నిండా ముంచింది. ముఖ్యంగా హరీస్ రౌఫ్ ఈ టోర్నీలో ఏకంగా 500 పరుగులిచ్చి ఒకే వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన సమర్పించుకున్న బౌలర్‌గా చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.