IPL 2023: నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య బిగ్ ఫైట్
ఈ వార్తాకథనం ఏంటి
ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు 53వ మ్యాచ్‌లో కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి.పంజాబ్ జట్టు ఈ టోర్నీలో 10 మ్యాచ్లు ఆడి ఐదింట్లో నెగ్గింది. అటు కోల్ కతా పది మ్యాచ్‌ల్లో నాలుగింట్లో విజయం సాధించింది.
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ 31 మ్యాచ్లు జరిగాయి. అందులో 20సార్లు కోల్ కతా గెలిస్తే.. 11 మ్యాచ్ ల్లో మాత్రమే పంజాబ్ గెలిచింది.
గత సీజన్‌లో ఇరు జట్లు ఒక్కసారి మాత్రమే పోటీపడగా.. ఆ మ్యాచ్లో కేకేఆర్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ చివరిసారిగా 2018లో ఈడెన్ గార్డెన్స్‌లో విజయాన్ని నమోదు చేసింది.
ఈడెన్ గార్డెన్స్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కేవలం మూడింట్లో మాత్రమే గెలుపొందింది.
Details
అరుదైన రికార్డుకు చేరువలో శిఖర్ ధావన్
ఐపీఎల్‌లో కేకేఆర్‌పై 861 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును పీబీకేఎస్ కెప్టెన్ శిఖర్ ధావన్ బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఆ రికార్డుకు ధావన్ 12 పరుగుల దూరంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్(1075), రోహిత్ శర్మ (1040) పరుగులతో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్‌లో 160 వికెట్ల క్లబ్‌లో చేరడానికి స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్‌కు ఒక వికెట్ కావాలి. ఈ సీజన్లో రింకూసింగ్, వెంకటేష్ అయ్యర్ 300కి పైగా పరుగులు చేసి మంచి ఫామ్ లో ఉన్నారు.
పీబీకేఎస్ తరఫున అర్ష్‌దీప్ సింగ్ 16 వికెట్లు తీసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.