IPL 2023: లిట్టన్ దాస్ స్థానంలో కేకేఆర్ లోకి వెస్టిండీస్ హిట్టర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ సీజన్లో పలు జట్ల ప్లేయర్లు గాయాల భారీన పడుతూ టోర్నీమొత్తానికి దూరమవుతున్నారు. కొందరు విదేశీ ప్లేయర్లు వ్యక్తిగత సమస్యల కారణంగా స్వదేశాలను వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్ కత్తా జట్టు ప్లేయర్ లిట్టన్ దాస్ ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా బంగ్లాదేశ్ కు వెళ్లిపోయాడు. అతని స్థానంలో కేకేఆర్ జట్టు వెస్టిండీస్ బిగ్ హిట్టర్ జాన్సన్ చార్లెస్ ను తీసుకుంది. ఈ విషయాన్ని కేకేఆర్ యాజమాన్యం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. చార్లెస్ ఇంతవరకూ ఐపీఎల్ లో అరంగ్రేటం చేయలేదు. అయితే టీ20 క్రికెట్లో ఆడిన అనుభవం ఉంది. చార్లెస్ రూ.50లక్షలకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
చార్లెస్ టీ20ల్లో సాధించిన రికార్డులివే
చార్లెస్ ఇప్పటివరకు వెస్టిండీస్ తరుపున 41 టీ20 మ్యాచ్ లను ఆడాడు. ఇందులో 24.27 సగటుతో 971 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. టీ20ల్లో వెస్టిండీస్ తరుపున అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడిగా చార్లెస్ నిలిచాడు. 2016లో ఐసీసీ ప్రపంచ టీ20 విజేతగా వెస్టిండీస్ జట్టును నిలపడంలో జాన్సన్ కీలక పాత్ర పోషించాడు. వికెట్ కీపింగ్ లోనూ చార్లెస్ కు మంచి ట్రాక్ ఉంది వేర్వేరుగా 224 టీ20 మ్యాచ్‌లను ఆడిన అనుభవం అతనికి ఉంది. ఈ ఫార్మట్‌లో మొత్తంగా 5,600 పరుగులు చేశాడు.