Saim Ayub : 9 ఏళ్ల బాలుడి బౌలింగ్‌కు సైమ్ అయూబ్ క్లీన్ బౌల్డ్.. వైరల్ వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
సైమ్ అయూబ్.. గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో పాకిస్థాన్ జట్టులో ఎదుగుతున్న ప్రముఖ ఆటగాళ్లలో అతడు ఒకడిగా గుర్తింపు సంపాదించాడు. 23 ఏళ్ల ఈ ఎడమచేతి బ్యాటర్ ఇప్పటివరకు పాకిస్థాన్ తరఫున 8 టెస్టులు, 17 వన్డేలు, 67 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 364 పరుగులు నమోదు చేసిన అతడు మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో 46.9 సగటుతో 751 పరుగులు చేసి మూడు సెంచరీలు, మూడు అర్థశతకాలు నమోదు చేశాడు. టీ20ల్లో 21.3 సగటుతో 1298 పరుగులు సాధించగా, అందులో ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
వివరాలు
పూర్తిగా దెబ్బతిన్న ఫామ్..
అయితే గత కొంతకాలంగా సైమ్ అయూబ్ ఫామ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో కూడా అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి కేవలం 258 పరుగులకే పరిమితమయ్యాడు. అయినప్పటికీ హైదరాబాద్ కింగ్స్ ఫ్రాంచైజీ అతడిని 12.6 కోట్ల పాకిస్థానీ రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో లీగ్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా నిలిచాడు. తాజా పేలవ ప్రదర్శనల కారణంగా ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేసిన 28 మంది వైట్‌బాల్ శిక్షణ శిబిరంలో సైమ్ అయూబ్‌కు స్థానం దక్కలేదు. అలాగే బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే టెస్టు జట్టులో కూడా అతడిని ఎంపిక చేయలేదు.
వివరాలు
నెట్టింట ట్రోల్స్ వైరల్..
ఇదిలా ఉండగా, తాజాగా సైమ్ అయూబ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో 9 ఏళ్ల జిదాన్ బషీద్ అనే బాలుడు వేసిన బంతికి అయూబ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ బంతిని డిఫెండ్ చేయాలని ప్రయత్నించినా, బ్యాట్‌కు తగలకుండా నేరుగా వికెట్లను తాకింది. చిన్నారి బౌలింగ్ చూసి అయూబ్ కూడా ఆశ్చర్యపోయాడు. అనంతరం ఆ బాలుడిని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మంచి క్రికెటర్‌గా ఎదుగుతావని అభినందించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుండగా, నెటిజన్లు సైమ్ అయూబ్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. "ఇదే పాక్ క్రికెట్ స్థాయి" అంటూ పలువురు ట్రోల్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో..
Saim Ayub Struggle with bat continues..!!
— Hamza Khan (@Hamzakhan17_) May 13, 2026
Saim Ayub Clean Bowled by a Kid in a practice session.😅 pic.twitter.com/AsMRROBbdV