Page Loader
డానిల్ మాద్వెదెవ్‌కు బిగ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఓటమి
మరోసారి నిరాశపరిచన డానిల్ మెద్వెదెవ్

డానిల్ మాద్వెదెవ్‌కు బిగ్ షాక్.. ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 31, 2023
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యన్ స్టార్ ఆటగాడు స్టార్ డానిల్ మెద్వెదెవ్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. రెండో సీడ్ డానిల్ మెద్వెదెవ్ తొలి రౌండ్ లోనే సైబొత్ వైల్డ్(బ్రెజిల్) చేతిలో పరాజయం పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో మెద్వెదెవ్‌ 6-7(5), 7-6(6), 6-2, 3-6, 4-6తో బ్రెజిల్‌ ఆటగాడు తియాగో చేతిలో ఓడాడు. మిగతా మ్యాచ్‌ల్లో పురుషుల నాలుగో సీడ్‌ కాస్పెర్‌ రూడ్‌ (నార్వే) 6-4, 6-3, 6-2తో క్వాలిఫయర్‌ ఎలియస్‌ వైమెర్‌ (స్వీడెన్‌)పై విజయం సాధించాడు. 22వ సీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) తొలిరౌండ్‌ దాటేందుకు కష్టపడ్డాడు. ఈ జర్మన్‌ ప్లేయర్‌ 7-6 (8/6), 7-6 (7/0), 6-1తో హ్యారిస్‌ (దక్షిణాఫ్రికా)పై వీరోచితంగా పోరాడి నెగ్గాడు.

Details

సత్తా చాటిన స్వియాటెక్ 

ఢిపెండింగ్ ఛాంపియన్ ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్మమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసింంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో పోలాండ్ స్టార్ 6-4, 6-0తో క్రిస్టినా బుక్సా (స్పెయిన్‌)పై సునాయాసంగా విజయం సాధించింది. కేవలం 13 నిమిషాల్లోనే మ్యాచును ముగించి సత్తా చాటింది. వైల్డ్‌కార్డ్‌ ప్లేయర్‌ డియన్‌ ప్యారీ (ఫ్రాన్స్‌) 6-2, 6-3తో 25వ సీడ్‌ అన్హెలినా కలినినా (ఉక్రెయిన్‌)కు వరుస సెట్లలో గెలుపొంది షాకిచ్చింది.