LOADING...
MS Dhoni: ధోనికి బిగ్ షాక్.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నోటీసులు
ధోనికి బిగ్ షాక్.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నోటీసులు

MS Dhoni: ధోనికి బిగ్ షాక్.. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జార్ఖండ్ హౌసింగ్ బోర్డు నోటీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా మాజీ కెప్టెన్, 'కెప్టెన్ కూల్'గా పేరొందిన ఎంఎస్.ధోనికి ఊహించని షాక్ తగిలింది. స్థలం వినియోగంపై జార్ఖండ్ స్టేట్ హౌసింగ్ బోర్డు (JSHB) తాజాగా నోటీసులు జారీ చేసింది. రాంచీలోని హర్ము ప్రాంతంలో ఉన్న ఆయనకు కేటాయించిన నివాస స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 2009లో ధోనీ సాధించిన అద్భుత విజయాలకు గుర్తుగా జార్ఖండ్ ప్రభుత్వం హర్ము ప్రాంతంలోని ప్లాట్ నంబర్ H-(10)Aను కేటాయించింది.

Details

'నివాస అవసరాల కోసమే కేటాయింపు

అయితే ఈ స్థలం కేవలం 'నివాస అవసరాల' (Residential Use) కోసం మాత్రమే కేటాయించారు. కానీ ప్రస్తుతం అక్కడ 'నీబర్గ్ పల్స్ డయాగ్నస్టిక్స్' పేరిట ఒక డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు బోర్డు గుర్తించింది. అంటే ఆ ప్లాట్‌ను 'వాణిజ్య అవసరాల' (Commercial Use)కోసం ఉపయోగిస్తున్నారని, ఇది కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నోటీసుపై స్పందించేందుకు ధోనీకి బోర్డు 15 రోజుల గడువు ఇచ్చింది. నిర్ణీత కాలంలో సరైన వివరణ ఇవ్వకపోతే, ఆ ప్లాట్ కేటాయింపును రద్దు చేయాలని సిఫార్సు చేసే అవకాశం ఉందని సమాచారం. కేవలం ధోనీకే కాకుండా ఇలాంటి నిబంధనలు ఉల్లంఘించిన మరికొందరికి కూడా నోటీసులు పంపినట్లు జార్ఖండ్ హౌసింగ్ బోర్డు అధ్యక్షుడు సంజయ్ లాల్ పాశ్వాన్ ధృవీకరించారు.

Details

ఇదే చివరి ఐపీఎల్ అయ్యే అవకాశం

హర్ములోని ఈ ఇల్లు ధోనీ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇంటి గోడలపై ఆయన పేరు, జెర్సీ నంబర్ 7, ప్రసిద్ధ హెలికాప్టర్ షాట్, వికెట్ కీపింగ్ యాక్షన్ చిత్రాలు అలరింపజేస్తుంటాయి. అక్కడికి వచ్చే పర్యాటకులు దీన్ని ఒక సెల్ఫీ పాయింట్‌లా భావిస్తారు. అయితే ప్రస్తుతం ధోనీ తన కుటుంబంతో కలిసి రాంచీలోని సిమాలియా రింగ్ రోడ్ వద్ద ఉన్న భారీ ఫామ్‌హౌస్‌లో నివసిస్తున్నారు. హర్ములోని ఆస్తి ప్రస్తుతం ఆయన పాత నివాసంగా మాత్రమే ఉంది. ఇదిలా ఉండగా ధోనీ త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్‌కు సిద్ధమవుతున్నారు. ఇది ఆయనకు చివరి ఐపీఎల్ కావచ్చని ప్రచారం సాగుతోంది.

Advertisement