Page Loader
Ruthuraj Gaikwad: ఇండియా-సికి బిగ్ షాక్ .. గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
ఇండియా-సికి బిగ్ షాక్ .. గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

Ruthuraj Gaikwad: ఇండియా-సికి బిగ్ షాక్ .. గాయపడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 12, 2024
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా-సి జ‌ట్టుకు బిగ్ షాక్ త‌గిలింది. అనంతపురం వేదిక‌గా ఇండియా బితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్‌, భార‌త యువ ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ గాయ‌ప‌డ్డాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ సాయి సుదర్శన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించేందుకు క్రీజులోకి వచ్చాడు. తొలి బంతికే ఫోర్ కొట్టి మంచి ఆరంభాన్ని అందుకున్నాడు. కానీ రెండో బంతికే గాయ‌ప‌డి గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రుతురాజ్ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సింది. ఈ మ్యాచ్‌ టెలికాస్ట్ లేనందున అత‌డికి ఏమైంద‌న్న విష‌యం బయటకు రాలేదు.

Details

ఇండియా సి జట్టులోని సభ్యులు వీరే

కాగా ఆదిలోనే గైక్వాడ్ రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో ఇండియా-సి జట్టు బాధ్యతను పాటిదార్‌, సాయిసుదర్శన్ తమ భుజాలపై వేసుకున్నారు. 22 ఓవర్లు ముగిసే సరికి ఇండియా-సి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది. సుదర్శన్‌(39), రజిత్ పాటిదార్‌(35) పరుగులతో ఆజేయంగా ఉన్నారు. తుది జట్లు ఇండియా సి అభిషేక్ పోరెల్ (వికెట్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), రజత్ పటీదార్, అన్షుల్ కాంబోజ్, బాబా ఇంద్రజిత్, బి సాయి సుదర్శన్, మయాంక్ మార్కండే, మానవ్ జగ్దూసకుమార్ సుతార్, వైషక్ విజయ్‌కుమార్, సందీప్ వారియర్