
ఆర్సీబీకి బిగ్ షాక్.. దినేష్ కార్తీక్ కు అనారోగ్యం
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 16వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అశించిన మేర రాణించలేదు. 11 మ్యాచ్ ల్లో ఐదు విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది.
మైనస్ రన్ రేట్ తో ఉన్న ఆర్సీబీ కి ఫ్లే ఆఫ్ చేరాలంటే చాలా కష్టం. మిగిలిన మూడు మ్యాచ్ ల్లోనూ భారీ విజయాన్ని నమోదు చేయాలి.
అదే విధంగా ఇతర జట్ల ఫలితాలు ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమిపాలైన ఆర్సీబీకి మరో గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఫినిషర్ దినేష్ కార్తీక్ అనారోగ్యానికి గురయ్యాడు. ఐపీఎల్ మొదట నుంచి అతను ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు.
Details
డీహైడ్రేషన్ తో ఇబ్బంది పడ్డ దినేష్ కార్తీక్
ఇక ముంబైలో మ్యాచ్ లో మంచి ఇన్నింగ్స్ ఆడి డీకే టచ్ లోకి వచ్చాడు. పెవిలియానికి వెళ్తున్న క్రమంలో కార్తీక్ కిందికి వంగిపోయి చాలా ఇబ్బందిగా మైదానాన్ని వీడాడు.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ లో అతను బరిలోకి దిగలేదు. అతని స్థానంలో అనూజ్ రావత్ ఈ ఇన్నింగ్స్ లో కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు.
దినేష్ కార్తీక్ ఆరోగ్యంపై ఆర్సీబీ కోచ్ సంజయ్ బంగర్ స్పందించాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డీకే డీహైడ్రేషన్ కు గురయ్యాడని, ఈ క్రమంలో వాంతులు చేసుకున్నాడని, అయితే వచ్చే మ్యాచ్ సమయానికి అతడు కోలుకుంటాడని సంజయ్ బంగర్ పేర్కొన్నారు.