
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు బిగ్ షాక్
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే కొన్ని జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కొంతమంది స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్‌కు దూరమయ్యారు. తాజాగా బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ జట్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతను అకిలెస్ సమస్య నుండి కోలుకుంటున్నాడు.ఈ కారణంగా గతంలో ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే సిరీస్‌లకు హేజిల్ వుడ్ దూరమైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం టీ20 బౌలర్ల ర్యాంకింగ్‌లో నాలుగో స్థానంలో హేజిల్‌వుడ్.. రెండేళ్లుగా గాయాల బెడదతో సతమతమవుతున్నాడు. ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఈ ఏడాది చివర్లో జరగనున్నందున, హేజిల్‌వుడ్ ఐపీఎల్ కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు.
బెంగళూర్
మొదటి మ్యాచ్‌లో ముంబైతో తలపడనున్న బెంగళూర్
హాజిల్‌వుడ్ గత సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 8.1 ఎకానమీ రేటుతో 20 వికెట్లు పడగొట్టాడు. RCB అతన్ని వేలంలో రూ.1.9 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
కాలు గాయం కారణంగా ఇటీవల ముగిసిన భారత్ వన్డే సిరీస్‌లో మాక్స్‌వెల్ చివరి రెండు మ్యాచ్‌లకు రెండు దూరమైన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 2 మొదటి మ్యాచ్‌లో బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్‌తో పోటీ పడనుంది.