ఐపీఎల్ 2023లో ఆర్సీబీ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్‌లో ముంబైతో ఢీ
ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ సమయం దగ్గర పడుతోంది. ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. ఆర్సీబీ మొదటి మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్‌తో తలపడనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఫాఫ్ డుప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా మారిన ఐపీఎల్ ట్రోఫీని ఈసారి ఎలాగైనా గెలవాలని ఆర్సీబీ కాన్ఫిడెన్స్ తో ఉంది. ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ బ్యాటర్ విల్ జాక్స్ జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ని ఆర్సీబీ తీసుకుంది. ఆర్సీబీలో స్టార్ ఆటగాళ్లు కొదవ లేకున్నా.. మ్యాచ్ విజయానికి కృషి చేయడం లేదు.
స్టార్ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ
ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్, దినేష్ కార్తీక్ వంటి స్టార్ ఆటగాళ్లతో ఆర్సీబీ పటిష్టంగా ఉంది. అల్ రౌండర్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్, వనిందు హసరంగా ఉన్నారు. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సిరాజ్, హర్షల్ పటేల్, వనిందు హసరంగా, దినేష్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, పాటిదార్, అనుజ్ రావత్, ఆకాశ్ దీప్, హేజిల్‌వుడ్, మహిపాల్ లోమ్రోర్, ఫిన్ ప్రభు అలెన్, , కర్ణ్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, డేవిడ్ విల్లీ, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, మనోజ్ భాండాగే, రాజన్ కుమార్, అవినాష్ సింగ్, సోను యాదవ్, బ్రేస్‌వెల్.