Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీంకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గాయం కారణంగా చివరి రెండు వన్డేలకు దూరమయ్యాడు.
శనివారం జరిగిన రెండో వన్డేలో అన్రిచ్ నోర్జే గాయపడ్డాడు. ఐదు ఓవర్లు వేసిన తర్వాత అతను మైదానాన్ని వీడాడు. తర్వాత వచ్చి ఫీల్డింగ్ చేసిన నొప్పి తీవ్రం కావడంతో చికిత్స కోసం జోహన్నస్ బర్గ్ కు పంపారు.
మిగిలిన రెండు వన్డే మ్యాచులకు వెన్ను గాయంతో దూరమైనట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
అత్యంత వేగవంతమైన బౌలర్లలో నోర్ట్జే ఒకరు. ఇప్పటివరకూ 22 వన్డేల్లో 5.86 ఎకానమీతో 36 వికెట్లు పడగొట్టాడు.
Details
నార్ట్జే స్థానంలో యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీ
ఇక రెగ్యులర్ కెప్టెన్ టెంబా బావుమా రైట్ అడక్టర్ స్ట్రెయిన్ కారణంగా నాల్గవ వన్డేకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఐడెన్ మర్క్రమ్ సౌతాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.
మూడో వన్డేకి నార్ట్జే స్థానంలో యువ పేసర్ గెరాల్డ్ కోయెట్జీని సౌతాఫ్రికా జట్టు ఎంపిక చేసింది.
బావుమా స్థానంలో రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌ను తీసుకొనే అవకాశం ఉంది. ఇక రీజా హెండ్రిక్స్‌ను ఓపెనర్ గా పంపనున్నారు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ జట్టు ఇప్పటికే 2-1తో ముందంజలో ఉంది. మొదటి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత, సౌతాఫ్రికా జట్టు మూడో వన్డేలో పుంజుకొని 111 పరుగుల విజయాన్ని సాధించింది.