Page Loader
Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. బెంగళూరులో కేసు నమోదు
విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. బెంగళూరులో కేసు నమోదు

Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. బెంగళూరులో కేసు నమోదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. బెంగళూరులో ఆయనకు చెందిన పబ్లిక్ ప్లేస్ అయిన వన్ 8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కస్తూర్బా రోడ్డులో ఉన్న ఈ పబ్‌లో ఇటీవల కబ్బన్ పార్క్ పోలీసులు అకస్మత్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా పబ్‌లో ప్రత్యేకంగా స్మోకింగ్‌కు వేరు చేసిన జోన్ లేకపోవడం గుర్తించారు. ప్రజలకు అనారోగ్య ప్రమాదాలు కలిగే పరిస్థితులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Details

పబ్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల నియంత్రణ చట్టం ప్రకారం సెక్షన్-4, సెక్షన్-21 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు పబ్ మేనేజర్‌తో పాటు కొంతమంది సిబ్బందిపై కూడా నేరపూరిత చర్యలు తీసుకున్నారు. దీనిపై కబ్బన్ పార్క్ స్టేషన్ ఎస్సై అశ్విని అధికారికంగా ధృవీకరించారు. ఈ ఘటన విరాట్ కోహ్లీ అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దేశంలో పబ్లిక్ హెల్త్ నిబంధనలు ఉల్లంఘించడంపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.