Page Loader
WTC 2023-25 Team of the Tournament : విరాట్, రోహిత్ శర్మకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జైస్వాల్, బుమ్రా ఎంపిక 
విరాట్, రోహిత్ శర్మకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జైస్వాల్, బుమ్రా ఎంపిక

WTC 2023-25 Team of the Tournament : విరాట్, రోహిత్ శర్మకు బిగ్ షాక్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో జైస్వాల్, బుమ్రా ఎంపిక 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 04, 2025
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సైకిల్‌ తుది దశకు చేరుకుంది. జూన్ 11 నుంచి 15 వరకూ లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌తో మూడో సైకిల్‌కు తెరపడనుంది. ఇందులో విజేతగా ఎవరు నిలవబోతున్నారన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో బుధవారం క్రికెట్ ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2023-25 టోర్నీకి సంబంధించిన 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌'ను ప్రకటించింది. ఈ జట్టును ఎంపిక చేయడంలో కేవలం గణాంకాలనే ఆధారంగా కాకుండా, ఆటగాళ్లు వివిధ పరిస్థితుల్లో ఇచ్చిన ప్రదర్శనను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ఈ ప్రెస్టీజియస్ జట్టులో భారతదేశానికి చెందిన ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది.

Details

32 వికెట్లు తీసిన బుమ్రా

ఓపెనర్ జైస్వాల్‌, పేసర్ బుమ్రా ఈ గౌరవాన్ని పొందారు. జైస్వాల్ 19 టెస్టులలో 1798 పరుగులు చేయగా, ఇందులో నాలుగు శతకాలు, 10 అర్ధశతకాలున్నాయి. మరోవైపు బుమ్రా 15 టెస్టుల్లో 77 వికెట్లు పడగొట్టాడు. ఇందులో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లు తీసిన ఘనత కూడా ఉంది. ఈ జట్టుకు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నాయకత్వం వహించనుండగా, అతని జట్టులోనే ఉన్న ఉస్మాన్ ఖవాజా, వికెట్ కీపర్ అలెక్స్ కేరీలకు కూడా స్థానం లభించింది. న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్, పేసర్ మాట్ హెన్రీలు జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్ తరఫున జో రూట్, హ్యారీ బ్రూక్ ఎంపికయ్యారు. శ్రీలంక నుంచి మెండిస్‌, పాకిస్తాన్ నుంచి నోమన్ అలీకి చోటు దక్కింది.

Details

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన WTC 2023-25 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ఈ విధంగా ఉంది 

యశస్వి జైస్వాల్ (భారత్) ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) జో రూట్ (ఇంగ్లాండ్) హ్యారీ బ్రూక్ (ఇంగ్లాండ్) కమిందు మెండిస్ (శ్రీలంక) అలెక్స్ కేరీ (ఆస్ట్రేలియా) - వికెట్ కీపర్ ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా) - కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (భారత్) మాట్ హెన్రీ (న్యూజిలాండ్) నోమన్ అలీ (పాకిస్తాన్) ఈ జట్టు ఎంపికతో మూడో సైకిల్‌లో ప్రతిభ కనబర్చిన అంతర్జాతీయ ఆటగాళ్లకు గుర్తింపు లభించింది.