అమెరికా,వెస్టిండీస్‌లకు బిగ్ షాకిచ్చిన ఐసీసీ! టీ20 వరల్డ్‌కప్ వేదికలో మార్పు..!
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 వేదిక మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం వెస్టిండీస్, అమెరికా సంయుక్త వేదికగా వచ్చే ఏడాది జూన్ లో టీ20 ప్రపంచ కప్ జరగాల్సి వచ్చింది. ఈ టోర్నీ ప్రారంభానికి ఇంకా సంవత్సర కాలం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఐసీసీ నిర్ధేశించిన మౌలిక సదుపాయాలను అమెరికా ఏర్పాటు చేయడం దాదాపు కష్టమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచ కప్ వేదికను మార్చాలనే యోచనలో ఐసీసీ ఉన్నట్లు సమాచారం. టీ20 ప్రపంచ కప్ వంటి మెగా ఈవెంట్‌లను వెస్టిండీస్ ఇంతకుముందు ఎన్నోసార్లు నిర్వహించింది. అమెరికా మాత్రం ఐసీసీ టోర్నమెంట్ కు అతిథ్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి.
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరిపిన ఐసీసీ
ఈ మెగా టోర్నీ ని ఇంగ్లండ్ లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ విషయంపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ చర్చలు జరిపినట్లు క్రికెట్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే టీ20 ప్రపంచ కప్ 2030 ఆతిథ్య హక్కులను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2024 ఇంగ్లండ్ నిర్వహిస్తే.. టీ20 ప్రపంచ కప్ 2030 ను వెస్టిండీస్, అమెరికా నిర్వహించే ఛాన్స్ ఉండనుంది.