బాడీబిల్డర్ జో లిండర్న్ కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ జర్మన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్స్, బాడీ బిల్డర్ జో లిండ్నర్ హఠాన్మరణం చెందాడు. అతను సోషల్ మీడియా వేదికగా ఫిటెనెస్ పాఠాలు చెబుతూ వినోదాన్ని పంచేవాడు.
అయితే ఆయన ఆకస్మిక మరణ వార్త విన్న అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అతనికి ఇప్పటివరకూ ఇన్ స్టాలో 8.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
జిమ్ వర్కౌట్ వీడియోలతో అతను అభిమానులను సంపాదించకున్నాడు. కొన్ని రోజుల క్రితం మెడ నొప్పి వచ్చినట్లు అతని గర్ల్ ఫ్రెండ్ నిచా ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది.
రక్తనాళాలు ఉబ్బడంతో అతను సడన్ గా ప్రాణాలు వదిలినట్లు ఆమె తెలిపింది.
Details
కొట్లాదిమంది అభిమానులను సంపాదించున్న జో లిండర్న్
1993 జనవరి 24న జర్మనీలో జో లిండర్న్ జన్మించాడు. అతను మరణించే సమయానికి అతను వయస్సు కేవలం 29 సంవత్సరాలు.
జో లిండ్నర్ ఫిట్‌నెస్ అథ్లెట్, యూట్యూబర్, బ్రాండ్ అంబాసిడర్, ఇంటర్నెట్ పర్సనాలిటీ, ఫిట్‌నెస్ మోడల్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందాడు. అతను చిన్నవయస్సులోనే తమ ఫిట్ నెస్ ప్రయాణాన్ని ప్రారంభించాడు.
బాడీ బిల్డింగ్ లో రావడానికి ముందు అతను ఓ క్లబ్‌లో బౌన్సర్ గా చేరాడు. పర్సనల్ ట్రైనింగ్ యాప్ ఏలియన్ గెయిన్స్ కు అతను ఓనర్ గా ఉన్నాడు. అయితే అతను స్టెరాయిడ్స్ వాడినట్లు ఓ య్యూటూబ్ ఛానెల్ పేర్కొనడం గమనార్హం.