ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో తళుక్కున మెరిసిన బాలీవుడ్ బ్యూటీ అనుష్కశర్మ
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ, ఎల్‌ఎస్‌జీ మధ్య జరిగిన మ్యాచ్‌లో బౌండరీల మోత మోగింది. ముందుగా ఆర్సీబీ బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురింపించగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు దుమ్ములేపారు. మరోవైపు బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఈ మ్యాచ్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌కు రావడం ఇదే తొలిసారి. దీంతో స్టేడియంలో కెమెరాలన్నీ అమెపై ఫోకస్ చేశారు. మొదట ఆర్సీబీ బ్యాటింగ్ చేసినప్పుడు అనుష్క శర్మ కనిపించలేదు.
ఆర్సీబీ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కెమెరా కంటికి అమె చిక్కింది.
అనుష్క శర్మ
ఆర్సీబీకి మద్దతు ఇచ్చిన అనుష్క శర్మ
లక్నో వికెట్ పడిన ప్రతిసారీ అనుష్క శర్మ ఎగిరి గంతేసింది. ప్రస్తుతం అమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనుష్క శర్మ.. కోహ్లీ ఆడే మ్యాచ్ లకు గతంలో హాజరైన విషయం తెలిసిందే. అయితే కూతురు వామికా మాత్రం కనిపించలేదు
మ్యాచ్ విషయానికొస్తే ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి లక్ష్యానికి చేరుకుంది.
లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్, స్టోయినిస్ విజృంభించడంలో లక్నో భారీ స్కోరును చేధించింది.