విరాట్ కోహ్లీ నెమ్మదిగా ఆడాడు: మాజీ న్యూజిలాండ్ ప్లేయర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో సోమవారం బెంగళూర్, లక్నో మధ్య మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో లక్నో విజయం సాధించింది. మొదటగా ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన 46వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. 35 బంతుల్లో 50 పరుగులను పూర్తి చేశాడు. ఈ ఐపీఎల్ లో కోహ్లీకి ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే, కోహ్లీ 25 బంతుల్లో 42 పరుగులను వేగంగా చేశాడు. ఇంకా ఎనిమిది పరుగులు చేయడానికి కోహ్లీ 10 బంతులను ఎదుర్కోవడం గమనార్హం. దీనిపై మాజీ న్యూజిలాండ్ ఆటగాడు సైమన్ డౌల్ స్పందించాడు.
డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుతంగా ఆడారు
కోహ్లీ మొదట రైలు లాగా వేగంగా ఆడాడని, చివరి 8 పరుగుల కోసం 10 బంతులను ఆడాడనని, దీంతో అతను హాఫ్ సెంచరీ చేసుకోవడానికి చాలా నెమ్మదిగా ఆడాడని, అతను ఇటువంటి సమయంలో చాలా ఆందోళన చెందుతున్నాడని సైమన్ డౌల్ పేర్కొన్నాడు. మ్యాచ్ గురించి మాట్లాడుతూ ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్‌వెల్ అద్భుతంగా ఆడారని, వారు విజృంభించడంతో ఆర్సీబీ భారీ స్కోరు సాధించిందన్నారు. తొమ్మిదో ఓవర్‌లో రవి బిష్ణోయ్ వేసిన సింగిల్‌తో కోహ్లి అర్ధశతకం సాధించాడు.