Shakib Al Hasan: బౌలింగ్ యాక్షన్ వివాదం.. షకీబ్ అల్ హసన్‌పై ఈసీబీ నిషేధం
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిషేధం విధించింది. దీంతో ఈసీబీ నిర్వహించే పోటీలలో అతడు ఇకపై బౌలింగ్ చేయకూడదు. ఈ నిర్ణయం సెప్టెంబర్‌లో జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో షకీబ్ బౌలింగ్ యాక్షన్‌పై ఫీల్డ్ అంపైర్ అభ్యంతరాల అనంతరం తీసుకుంది. షకీబ్ ఈ పోటీలో సర్రే తరఫున బౌలింగ్ చేస్తూ సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్‌లో షకీబ్ బౌలింగ్‌పై అభ్యంతరాలు
అయితే ఈసీబీ విచారణలో అతడి బౌలింగ్ యాక్షన్‌లో మోచేయి 15 డిగ్రీల కంటే ఎక్కువగా వంగిపోవడం తేలింది. ఈ నేపథ్యంలో షకీబ్ అల్ హసన్‌పై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధం డిసెంబర్ 10 నుండి అమల్లోకి వచ్చింది. తద్వారా అతడు ఈసీబీ పోటీల్లో బౌలింగ్ చేయడాన్ని నిషేధించారు.