Page Loader
Mike Tyson: బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓటమి
బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓటమి

Mike Tyson: బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓటమి

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2024
11:25 am

ఈ వార్తాకథనం ఏంటి

బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కమ్ బ్యాక్ మ్యాచ్ చప్పగా సాగింది. ఏ మాత్రం పోరాటం చేయకుండానే మైక్ టైసన్ నిష్క్రమించారు. టెక్సాస్ లో జరిగిన ఈ మ్యాచులో జేక్ పాల్ చేతిలో 74-78 తేడాతో మైక్ టైసన్ ఓటమి పాలయ్యారు. ఏటీఅండ్‌టీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో జేక్ పాల్ సునాయసంగా గెలుపొందారు. టైసన్ బాక్సింగ్‌లో ఒకప్పుడు సంచనాలు సృష్టించినా, జేక్ పౌల్ విసిరిన పంచ్‌లకు తట్టుకోలేకపోయాడు. ప్రతి రౌండ్ 1 నిమిషం పాటు సాగింది. ఇందులో జేక్ పౌల్, టైసన్‌ను పలుమార్లు దెబ్బకొట్టాడు. టైసన్ ప్రతీ సారి తిరిగి పోరాడేందుకు ప్రయత్నించారు. అయితే టైసన్ వేగం తగ్గిపోయినట్లు బాక్సింగ్ నిపుణులు అంచనా వేశారు. .

Details

టైసన్ పంచ్ లలో శక్తి తగ్గింది

టైసన్ కాళ్లలో వేగం తగ్గడం, పంచ్‌లలో శక్తి తగ్గినట్లు కనిపించింది. 2005లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైర్ అయిన టైసన్, ఇప్పుడు 58 ఏళ్ల వయసులో తన చివరి పోరాటం నిర్వహించాడు. టైసన్ తన గెలుపును కూడా జేక్ పౌల్‌కు గ్లౌజ్‌లు ఇచ్చి, ఆటతీరు చక్కగా ముగిసేలా చేశాడు. 8వ రౌండ్ చివర్లో టైసన్, పౌల్‌కు గౌరవం ప్రదర్శిస్తూ తలవంచాడు. మ్యాచ్ మొదలు కాగానే పోటెత్తిన వ్యూయర్ షిప్ తో నెట్ ప్లిక్స్ సైట్ క్రాష్ అవడం గమనార్హం.