
Doug Bracewell: కొకైన్ పరీక్షలో బ్రేస్‌వెల్‌కు పాజిటివ్.. నెల రోజుల పాటు నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ డగ్ బ్రేస్‌వెల్ తన కెరీర్‌లో మరో వివాదంలో చిక్కుకున్నాడు.
కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో, అతడిపై స్పోర్ట్స్ ఇంటెగ్రిటీ కమిషన్ (SIC) నెల రోజుల నిషేధాన్ని విధించింది.
ఈ ఘటన జనవరి 2024లో జరిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్‌ల దేశీయ టీ20 మ్యాచ్ తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ మ్యాచ్‌లో బ్రేస్‌వెల్ తన అద్భుత ప్రదర్శనతో హీరో ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆ మ్యాచ్‌లో అతను 21 పరుగులకే 2 వికెట్లు తీయడం, 11 బంతుల్లో 30 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడటం, రెండు కీలక క్యాచ్‌లు అందుకోవడం ద్వారా తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.
Details
ధ్రువీకరించిన ఎస్ఐసీ
కానీ మ్యాచ్‌కు సంబంధం లేని సందర్భాల్లో బ్రేస్‌వెల్ కొకైన్ సేవించాడని ఎస్ఐసీ ధ్రువీకరించింది.
బ్రేస్‌వెల్‌కు తొలుత మూడు నెలల నిషేధం విధించినా, చికిత్స కార్యక్రమం పూర్తి చేసిన తరువాత దాన్ని నెల రోజులకే తగ్గించారు.
ఎస్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రెబెక్కా రోల్స్ మాట్లాడుతూ క్రీడాకారులు సమాజానికి ఆదర్శంగా ఉండాలని, కొకైన్ వంటి చట్టవిరుద్ధ పదార్థాల వినియోగం ప్రమాదకరమైనదిగా మిగతా క్రీడాకారులకు అవగాహన కల్పించడమే తమ లక్ష్యమన్నారు.
బ్రేస్‌వెల్ ఆట మైదానంలో అదిరిపోయే ప్రదర్శనను చూపించినప్పటికీ, అతని వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారింది.
2008లో మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో అతనిపై మొదటిసారి కేసు నమోదైంది. 2010, 2017లో కూడా ఇలాంటి వివాదాలు ఎదుర్కొన్నాడు.
Details
28 టెస్టులాడిన బ్రేస్ వెల్
2011లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన బ్రేస్‌వెల్ 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ20 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
అతని బౌలింగ్ నైపుణ్యం, ఆల్‌రౌండర్ ప్రతిభతో న్యూజిలాండ్ క్రికెట్‌కు గుర్తింపు తెచ్చిన బ్రేస్‌వెల్ వ్యక్తిగత జీవనశైలితో మాత్రం తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.
ఈ ఘటన అతని కెరీర్‌పై మరింత ప్రభావం చూపే అవకాశముంది. బ్రేస్‌వెల్ ఈ ఎదురుదెబ్బల నుంచి ఎలా కోలుకుంటాడన్నది క్రీడా ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.