Page Loader
Brendon Taylor: రూ.11 లక్షల స్పాట్ ఫిక్సింగ్.. నిషేధం అనంతరం బ్రాండన్ టేలర్ మళ్లీ క్రికెట్ బరిలోకి! 
రూ.11 లక్షల స్పాట్ ఫిక్సింగ్.. నిషేధం అనంతరం బ్రాండన్ టేలర్ మళ్లీ క్రికెట్ బరిలోకి!

Brendon Taylor: రూ.11 లక్షల స్పాట్ ఫిక్సింగ్.. నిషేధం అనంతరం బ్రాండన్ టేలర్ మళ్లీ క్రికెట్ బరిలోకి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 23, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

జింబాబ్వే మాజీ కెప్టెన్, ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ బ్రాండన్ టేలర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అతనిపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విధించిన 3.5 సంవత్సరాల నిషేధం ఈ నెల 25న ముగియనున్న నేపథ్యంలో టేలర్ రీ ఎంట్రీకు బరిలోకి దిగనున్నాడు. స్పాట్ ఫిక్సింగ్‌తో నిషేధం 2022లో భారతీయ వ్యాపారవేత్తతో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పాల్గొన్న కారణంగా ఐసీసీ బ్రాండన్ టేలర్‌పై 3.5 సంవత్సరాల నిషేధం విధించింది. ఈ వ్యవహారంలో టేలర్ కేవలం రూ.11 లక్షల కోసం ఫిక్సింగ్‌కు ఒప్పుకున్నాడని దర్యాప్తులో తేలింది. 2021లో అతని బ్లడ్ టెస్టులో కొకైన్ మెటాబోలైట్‌ను గుర్తించడంతో మరింతగా ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ అంశాల నేపథ్యంలో ఐసీసీ అతనిపై కఠిన చర్యలు తీసుకుంది.

Details

రిటైర్మెంట్ తర్వాత కోచింగ్

నిషేధం కారణంగా టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి కోచింగ్ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నిషేధం ముగియనుండటంతో అతను మళ్లీ మైదానంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. వచ్చే నెల న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో టేలర్‌ను ఎంపిక చేసే అవకాశమున్నట్టు సమాచారం. 2027 ప్రపంచ కప్ ఆడటం కూడా అతని ప్రాధాన్యంగా మారింది.

Details

అత్యుత్తమ కెరీర్ గణాంకాలు

బ్రాండన్ టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ స్థిరమైన కెరీర్‌ను అందుకున్నాడు. టెస్టులు: 34 మ్యాచ్‌లు - 6 సెంచరీలతో 2320 పరుగులు వన్డేలు: 205 మ్యాచ్‌లు - 6684 పరుగులు (సగటు 35 కంటే ఎక్కువ) టీ20లు: 45 మ్యాచ్‌లు - 934 పరుగులు ఇండియాపై సెంచరీ గుర్తుండేలా 2015 ప్రపంచకప్‌లో ఆక్లాండ్ వేదికగా టీమ్ ఇండియాపై 138 పరుగుల సునాయాస సెంచరీతో టేలర్ ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ఆయన కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. మొత్తానికి, బ్రాండన్ టేలర్ తీరా తిరిగి వస్తున్న క్రికెట్ ప్రయాణం ఇంకొంత ఆసక్తికరంగా మారబోతోందనడంలో సందేహమే లేదు.