Team India History: ఆసీస్ రికార్డు బద్దలు.. వరుసగా 16 విజయాలతో టీమిండియా నయా చరిత్ర!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇంటర్నేషన్ క్రికెట్ టీం (ICC) టోర్నీల చరిత్రలో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో భారత్ వరుసగా 16 మ్యాచ్‌లు గెలిచి ఈ ప్రత్యేక ఘనతను అందుకుంది. జట్టు స్థిరత్వం, సమిష్టి ప్రదర్శన, కీలక సమయాల్లో ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యానికి ఈ విజయ పరంపర నిదర్శనంగా నిలిచింది. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం కొలంబోలో పాకిస్థాన్‌పై సాధించిన విజయంతో భారత్ ఈ రికార్డును నెలకొల్పింది. ఈ గెలుపుతో ఆసీస్ పేరిట ఉన్న పాత రికార్డు చెరిగిపోయింది.
Details
గతంలో 12 విజయాలను నమోదు చేసిన ఆసీస్
ఇప్పటివరకు ఈ ఘనత ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2006-2007 మధ్య ఆస్ట్రేలియా వరుసగా 15 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో నిలిచింది. అంతేకాకుండా 2023-2024లో 14 విజయాలు, 2003-2004లో 13 విజయాలతో కూడా ఆసీస్ తమ ఆధిపత్యాన్ని చాటింది. భారత్ కూడా గతంలో 2012-2014 మధ్య 12 వరుస విజయాలు సాధించిన రికార్డు కలిగి ఉంది. ఇతర జట్ల విషయానికి వస్తే, వెస్టిండీస్ (1975-1979), శ్రీలంక (1996-1998), పాకిస్థాన్ (2019-2021) జట్లు వరుసగా 9 విజయాలతో తమదైన ముద్ర వేశాయి.
Details
భారత్ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం
తాజా ఘనతతో భారత్ ఐసీసీ టోర్నీల్లో తన ఆధిపత్యాన్ని మరింత బలపరిచింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ప్రస్తుత ఫామ్ ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. ముఖ్యంగా పెద్ద టోర్నీల్లో వరుస విజయాలు సాధించడం అనేది జట్టు ప్రతిభ, సరైన వ్యూహరచన, ఒత్తిడిలో నిలబడే మానసిక దృఢత్వానికి ప్రతీక. ఈ విజయ పరంపరను కొనసాగిస్తూ భారత్ మరిన్ని రికార్డులు బద్దలు కొడుతుందని అభిమానులు విశ్వాసంగా భావిస్తున్నారు.