ICC Team of The Year 2025: వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. జట్టుకు సారథిగా శ్రీలంక ఆటగాడు
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024 (ICC ODI Team of The Year 2024) జాబితాను ఐసీసీ ప్రకటించింది.
ఈ జాబితాలో ఒక్క భారత క్రికెటర్‌కి కూడా స్థానం కల్పించకపోవడం అభిమానుల మధ్య కొత్త చర్చకు దారి తీసింది.
మొత్తం 11 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు శ్రీలంక క్రికెటర్ చరిత్ అసలంక సారథ్యాన్ని అందజేశారు.
ఆసక్తికరంగా, ఉపఖండ ప్రాంతానికి చెందిన 10 మంది క్రికెటర్లకు ఈ జట్టులో స్థానం దక్కింది.
జట్టులోని ప్లేయర్ల జాబితా పరిశీలిస్తే, శ్రీలంక నుంచి నలుగురు, పాకిస్థాన్ నుంచి ముగ్గురు, అఫ్గానిస్థాన్ నుంచి ముగ్గురు, వెస్టిండీస్ నుంచి ఒకరికి అవకాశం లభించింది.
వివరాలు
భారత ఆటగాళ్లకు అవకాశం లేకపోవడానికి కారణమేమిటి?
భారత క్రికెటర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోవడానికి ప్రధాన కారణం వారు గతేడాది చాలా తక్కువ వన్డేలు ఆడటం అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
భారత్ కేవలం మూడు వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడగా, ఆ మూడు మ్యాచ్‌ల్లో ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేకపోయింది.
టీ20 వరల్డ్ కప్, టెస్టు ఛాంపియన్‌షిప్ వంటి ప్రధాన టోర్నమెంట్లపై ఎక్కువ దృష్టి పెట్టడంతో భారత జట్టు వన్డేలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చింది.
2023లో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు పాల్గొన్నప్పటికీ, ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. మొదటి రెండు మ్యాచుల్లో శ్రీలంక విజయం సాధించగా, చివరి మ్యాచ్ టైగా ముగిసింది.
వివరాలు
టీమ్ ఇదే..
అదే సమయంలో, శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ జట్లు ఎక్కువగా వన్డే ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడటంతో వారి ఆటతీరుకు అనుగుణంగా ఐసీసీ జట్టులో చోటు దక్కింది అని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సైమ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్థాన్), పాథున్ నిస్సాంక (శ్రీలంక), కుశాల్ మెండిస్ (శ్రీలంక), చరిత్ అసలంక (కెప్టెన్) (శ్రీలంక), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గానిస్థాన్), వనిందు హసరంగ (శ్రీలంక), షహీన్ షా అఫ్రిది (పాకిస్థాన్), హారిస్ రవూఫ్ (పాకిస్థాన్), ఏఎం ఘజాన్‌ఫర్ (అఫ్గానిస్థాన్).