Page Loader
ఫైనల్‌కు చేరుకున్న బ్రిస్బేన్ హీట్
ఫైనల్ కు అర్హతకు సాధించిన బ్రిస్బేన్ హీట్

ఫైనల్‌కు చేరుకున్న బ్రిస్బేన్ హీట్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2023
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిగ్‌బాష్ లీగ్ ఫైనల్‌కు బ్రిస్బేన్ హీట్ చేరుకుంది, సిడ్నీ సిక్సర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో బ్రిస్బేన్ హీట్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్ నిర్ణీత 20 ఓవర్ల కు 9 వికెట్ల నష్టానికి 116 పరుగులను మాత్రమే చేసింది. 10 బంతులు మిగిలి ఉండగానే బ్రిస్బేన్ హీట్ లక్ష్యాన్ని చేధించింది. ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్‌తో బ్రిస్బేన్ హీట్ తలపడనుంది. ఆరు విజయాలు, ఏడు ఓటములతో 13 పాయింట్లతో బ్రిస్బేన్ హీట్ ఐదో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో సిడ్నీ థండర్‌ను, నాకౌట్‌లో మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌ను, సిక్సర్‌లను ఓడించి బ్రిస్బేన్ హీట్ ఫైనల్లోకి ప్రవేశించింది.

మైఖేల్ నేజర్

అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా మైఖేల్ నేజర్

హీట్ 12 సీజన్లలో నాలుగోసారి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. 2016-17, 2020-21 ఎడిషన్లలో హీట్ గ్రూప్ దశను అధిగమించింది. 2014-15 సీజన్‌లో చివరి స్థానంలో నిలిచారు. బ్రిస్బేన్ స్టార్‌గా ఆటగాడిగా జమ్మీ పీర్సన్ నిలిచాడు. ఈ సీజన్లో 331 పరుగులు చేసి పరుగుల సునామిని సృష్టించాడు. అదే విధంగా మాట్ రెన్‌షా (283), కోలిన్ మున్రో (278), ఉస్మాన్ ఖవాజా (249) పరుగులతో బ్రిస్బేన్ జట్టులో కీలకంగా మారారు. బ్రిస్బేన్ బ్యాటర్ మున్రో సిడ్నీ థండర్‌పై చేసిన 98 పరుగులే ఈ సీజన్‌లో అత్యధికం కావడం గమనార్హం. మైఖేల్ నేజర్ బ్రిస్బేన్ తరుపున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 16 మ్యాచ్ లో 17.57 సగటుతో 26 వికెట్లను తీశాడు.