
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు పెద్దమొత్తంలో వేతనాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న క్రీడాకారులుగా రికార్డుకెక్కన్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆస్ట్రేలియా, ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ మధ్య నూతనంగా ఐదేళ్ల ఒప్పందం కుదిరింది. దీంతో ఆస్ట్రేలియా మహిళా క్రీడాకారుల వేతనాలు 53 మిలియన్ల వరకు పెరగనున్నాయి.
కొత్తగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఆస్ట్రేలియన్ పురుష, మహిళా ప్రొఫెషనల్ క్రికెటర్లు రాబోయే ఐదేళ్లలో 634 మిలియన్లను పంచుకోనున్నారు. ఇది ప్రస్తుతం ఒప్పందం కంటే 26 శాతం ఎక్కువని చెప్పొచ్చు.
మరే ఇతర క్రీడల్లోనూ ఇంత పెద్ద మొత్తంలో ఆస్ట్రేలియా క్రీడాకారిణులకు జీతభత్యాలు లేకపోవడం గమనార్హం.
ఆస్ట్రేలియా
మహిళలు క్రికెట్ కెరీర్‌ను ఎంచుకొనే విధంగా ఆడుగులు
ఈ సంవత్సరం ప్రారంభంలో ఆస్ట్రేలియా మహిళల జట్టు దక్షిణాఫ్రికాలో జరిగిన ఆరో ఐసిసి మహిళల టీ 20 ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
క్రికెట్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచి, నైపుణ్యాన్ని ప్రోత్సహించడానికే వారి జీతభత్యాలను పెంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. మహిళలు క్రికెట్ కెరీర్‌ను ఎంచుకొనే విధంగా క్రికెట్ ఆస్ట్రేలియా పనిచేస్తోంది.
ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియన్ మహిళల జట్టు, డబ్ల్యూబీబీఎల్ స్ఫూర్తిదాయకమైన రోల్ మోడల్స్‌కు వేతనంలో గణనీయమైన పెరుగుదల ఉందని, వారు మహిళల భాగస్వామ్యంలో గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నారని సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లీ చెప్పారు.