సీఎస్కే ఫ్యాన్స్‌కు బంఫరాఫర్.. విజిల్ పోడు ఎక్స్‌ప్రెస్ మళ్లీ వచ్చేసింది
ఐపీఎల్‌లో చైన్నై సూపర్ కింగ్స్ ఉండే క్రేజీ అంత ఇంత కాదు. ముఖ్యంగా జట్టుకు ధోని నాయకత్వం వహిస్తున్నప్పటి నుంచి చైన్నైపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సీఎస్కే నాలుగు సార్లు ట్రోఫీని ముద్దాడింది. గత రెండు సీజన్లో విఫలమైనా ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. తాజాగా సీఎస్కే యాజమాన్యం అభిమానుల కోసం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. సీఎస్కే అభిమానుల కోసం ఏకంగా ఓ ప్రత్యేక రైలునే ఏర్పాటు చేసింది. చైన్నై బయట ఉండే అభిమానులు కోసం సీఎస్కే మ్యాచ్‌లు చూడటానికి ఈ సదుపాయాన్ని కల్పించింది. 2018లో చివరిసారిగా ఈ రైలు కనిపించగా.. ఐదేళ్ల తర్వాత మళ్లీ విజిల్‌పోడు ఎక్స్‌ప్రెస్ వస్తున్నట్లు సీఎస్కే ప్రాంచైజీ ప్రకటించింది.
అభిమానుల కోసం ప్రత్యేకంగా రైలు
ఏప్రిల్ 30న చెపాక్ స్టేడియంలో చైన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఈ స్పేషల్ ట్రైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు చెందిన 750 మంది అభిమానులు ఈ ట్రైన్ లో ప్రయాణించే అవకాశం ఉంది. కన్యాకుమారి, తిరునెల్వేలి, మధురై, దిండిగుల్, తిరుచ్చిలాంటి నగరాలను నుంచి అభిమానులను ఎంపిక చేశారు. ఈ విజిల్ పోడు ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 29న కన్యాకుమారి నుంచి బయలదేరనుంది. ఏప్రిల్ 30న మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ రైలు తిరుగు ప్రయాణమవుతుంది. అభిమానుల వసతి, టికెట్, భోజన ఖర్చులు ప్రాంచేజీయే భరించనుంది.