NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం?
    తదుపరి వార్తా కథనం
    IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం?
    గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోని

    IPL 2023 : CSK కి మరో బిగ్ షాక్.. నెక్ట్ మ్యాచ్ కు ధోని దూరం?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 13, 2023
    02:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ చేతిలో చైన్నై సూపర్ కింగ్స్ పరాజయం పాలైంది.

    చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని జట్టు 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్లో చైన్నై రెండో ఓటమిని చవిచూసింది.

    కెప్టెన్ ఎంఎస్ ధోని చివరి వరకు క్రీజులో ఉన్న ఆఖరికి విజయం రాజస్థాన్ రాయల్స్ నే వరించింది. చివరి బంతికి బౌండరీ కొట్టడంలో ధోని విఫలం కావడంతో చైన్నైకి ఓటమి తప్పలేదు.

    ఈ మ్యాచ్ లో ధోని 17 బంతుల్లో (ఒక్క ఫోర్, మూడు సిక్సర్లు) 32 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది.

    ఎంఎస్ ధోని

    మోకాలి గాయంతో బాధపడుతున్న ఎంఎస్ ధోని

    ప్రస్తుతం చైన్నై జట్టుకు బిగ్ షాక్ తగిలేలా ఉంది. ప్రస్తుతం ఎంఎస్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ విషయంపై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పందించాడు.

    ధోని ప్రస్తుతం మోకాలి సమస్యతో బాధపడుతున్నాడని, దీంతో మైదానంలో పరుగులు తీసేందుకు ఇబ్బంది పడ్డానని, రెండు పరుగులు రావాల్సిన సమయంలో ఒక పరుగు మాత్రమే తీశాడని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు.

    ప్రస్తుతం తమ వైద్య బృందం అతని గాయాన్ని పర్యవేక్షిస్తోందని, ఇక తర్వాతి మ్యాచ్ కు నాలుగు సమయం ఉందని, ఆలోగా ధోని కచ్చితంగా కోలుకుంటాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఏప్రిల్ 17న చిన్న స్టేడియంలో బెంగళూర్‌తో చైన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎంఎస్ ధోని
    ఐపీఎల్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఎంఎస్ ధోని

    వాంఖడే స్టేడియంలో ధోనికి అరుదైన స్థానం క్రికెట్
    ఐపీఎల్‌లో మరో మైలురాయిని చేరుకున్న ఎంఎస్ ధోని ఐపీఎల్
    డ్వేన్ బ్రావో తల్లికి ఎంఎస్ ధోని శుభాకాంక్షలు ఐపీఎల్
    ఐపీఎల్‌లో సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్పెషల్ రికార్డు ఐపీఎల్

    ఐపీఎల్

    రిచర్డ్ సన్ స్థానంలో మరో పేస్ బౌలర్‌ను ఎంచుకున్న ముంబై ఇండియన్స్ ముంబయి ఇండియన్స్
    లక్నో సూపర్ జెయింట్స్ VS హైదరాబాద్.. రైజర్స్ రాత మారేనా..? సన్ రైజర్స్ హైదరాబాద్
    మాస్ స్టెప్పులతో అదరగొట్టిన చాహెల్, జోరూట్ (వీడియో) రాజస్థాన్ రాయల్స్
    చేతులెత్తేసిన సన్ రైజర్స్ బ్యాటర్లు.. లక్నో ముందు స్పల్ప స్కోరు లక్నో సూపర్‌జెయింట్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025