IPL 2023: ధోనీలో ఏదో తప్పు ఉంది: మాథ్యూ హెడన్
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ రాయల్స్ పై చైన్నై సూపర్ కింగ్స్ 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో 21 పరుగులు అవసరం కాగా.. కేవలం 18 పరుగులే వచ్చాయి.
చివర్లో ధోని రెండు సిక్సర్లు బాది ఊపు తెచ్చినా చివరి బంతికి బౌండరీ కొట్టలేకపోయాడు. దీంతో చైన్నై పరాజయం పాలైంది. కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ మాథ్యూ హెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ధోనిలో ఖచ్చితంగా ఏదో తప్పు ఉందని, తాము అభిమానులకు తప్పుడు సమాచారం ఇవ్వలేమని, అయితే వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తే ధోని.. రాజస్థాన్ తో బ్యాటింగ్ చేసేటప్పుడు కుంటుతూ కనిపించాడని, ఈ విషయంపై ధోని సమాధానం చెప్పాలన్నారు.
ధోని
17 బంతుల్లో 32 పరుగులు చేసిన ధోని
వైద్య సిబ్బంది మైదానంలోకి వెళ్లి గాయంపై ఆరా తీస్తారని అనుకున్నానని, అయితే ధోని అలాగే అడుతూనే ఉన్నాడని మాథ్యూహెడన్ చెప్పారు.
చిదంబరం స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని 17 బంతుల్లో 32 పరుగులు చేసి ప్రశంసలు అందుకున్నాడు.
సందీప్ శర్మ వేసిన మొదటి 3 బంతుల్లో ధోని 2 సిక్సర్లు బాదాడు, అయితే ఆ ఓవర్ చివరి బంతికి 5 పరుగులు కావాల్సిన సమయంలో ధోని బౌండరీ కొట్టలేకపోయాడు
ప్రస్తుతం సీఎస్కే రెండు విజయాలు, రెండు ఓటములతో మొత్తం నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.