Chris Martin: కోల్డ్‌ప్లే కాన్సర్ట్‌లో బుమ్రా క్లిప్.. క్షమాపణ కోరిన క్రిస్ మార్టిన్
ఈ వార్తాకథనం ఏంటి
రెండు రోజులపాటు సాగిన తమ కాన్సర్ట్‌ను కొద్దిసేపు మధ్యలోనే ఆపాల్సిన పరిస్థితి కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్‌కు ఎదురైంది.
నవీ ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి రెండోసారి నిర్వహించిన కాన్సర్ట్ సందర్భంగా టీమిండియా క్రికెటర్ జస్పిత్ బుమ్రా బౌలింగ్ క్లిప్‌ను ప్రదర్శించేందుకు షోకు కాసేపు బ్రేక్ ఇచ్చారు.
2024లో ఇంగ్లండ్ బ్యాటర్ ఓలీ పోప్‌ను యార్కర్‌తో బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేసిన క్లిప్‌ను మార్టిన్ బ్యాండ్ ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఘటనకు వెనుక ఓ కథనం ఉంది. కాన్సర్ట్ సందర్భంగా క్రిస్ మార్టిన్ అభిమానుల్లో ఉత్సాహం పెంచేలా, 'స్టేజ్ వెనుక బుమ్రా ఉన్నాడు, అతను బౌలింగ్ చేసేందుకు షోను ఆపాల్సి ఉందని మాట్లాడారు.
Details
బుమ్రా ప్రతిభపై గౌరవం ఉంది
అయితే మరుసటి రోజే మార్టిన్ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తూ అది అబద్ధమని అంగీకరించారు.
బుమ్రా స్టేజ్ వెనుక ఉన్నాడని చెప్పడం నిజం కాదని తాను అబద్ధం చెప్పానని, ఇందుకు క్షమాపణలు కోరాడు. అతడి ప్రతిభపై తమకు ప్రత్యేకమైన గౌరవం ఉందని, అందుకే ఇంగ్లండ్ బ్యాటర్‌ను అవుట్ చేసిన క్లిప్‌ను ప్రదర్శించామని మార్టిన్ అన్నారు.
ప్రస్తుతం జస్‌ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో చివరి టెస్టు సందర్భంగా ఈ సమస్య తిరగబెట్టింది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రాను బీసీసీఐ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌కు ఎంపిక చేసింది. ఎన్‌సీఏ వైద్య బృందం నివేదిక ఆధారంగా బుమ్రా ఆ మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది తేలనుంది.