Page Loader
ప్లీజ్.. అలసిపోయాను సార్ : జస్ప్రిత్ బుమ్రా
2019 మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో ఐదు వికెట్లు తీసిన బుమ్రా

ప్లీజ్.. అలసిపోయాను సార్ : జస్ప్రిత్ బుమ్రా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2023
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్ క్రికెట్ టీమ్‌లో స్టార్ పేస్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా ఉంది. అలాంటి పేసర్ సేవలను కొన్ని నెలలుగా టీమిండియా కోల్పోయింది. వెన్ను గాయంతో గతేడాది సెప్టెంబర్ తర్వాత బుమ్రా టీమిండియా ఆడలేదు. ఎప్పుడు మైదానంలో ఉత్సహంగా కనిపించే బుమ్రా ఒకానొక సందర్భంలో అలసిపోయానని స్వయంగా చెప్పడం గమనార్హం. టీమిండియా 2019లో ఆస్ట్రేలియాలో పర్యటించింది. 4 టెస్టుల బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఆ తర్వాతి టెస్టు కోసం సిడ్నీకి చేరుకున్నాడు. అయితే ఆ పిచ్ పేసర్లు బాగా సహకరిస్తుంది. దాంతో కొంచెం ఒత్తిడికి గురైన బుమ్రా బౌలింగ్ కోచ్ భరత్అరుణ్‌ను సంప్రదించాడట.

బుమ్రా

వేగం తగ్గించి బంతులేయమంటారా సార్ : బుమ్రా

సర్ వికెట్ కాస్త నిర్జీవంగా కనిపిస్తోందని, ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా లేదని అరుణ్ తో బుమ్రా చెప్పాడని శ్రీధర్ రాశాడు. తాను సొమ్మసిల్లిపోయానని, మానసికంగా, శారీరకంగా అలసిపోయానని, బహుశ మ్యాచ్ డ్రా కావొచ్చని, వేగం తగ్గించి బంతులేయమంటారా అని బౌలింగ్ కోచింగ్‌ని బుమ్రా అడిగాడు. తనదైన వ్యూహాలతో స్వేచ్ఛగా బౌలింగ్‌ చేయాలని బుమ్రాకు బౌలింగ్ కోచ్ భరత్ సూచించాడట. బుమ్రా అన్నట్లుగానే సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసిపోయింది. స్పిన్నర్లకు అనుకూలించిన పిచ్‌పై టీమిండియా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో చెలరేగాడు.