LOADING...
Jasprit Bumrah : అయ్యో… బుమ్రాకు ఏమైందీ?
అయ్యో… బుమ్రాకు ఏమైందీ?

Jasprit Bumrah : అయ్యో… బుమ్రాకు ఏమైందీ?

వ్రాసిన వారు Moogati Shabari
Apr 13, 2026
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా చెందిన ప్రధాన ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చాలా కాలంగా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు అతను ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. అంతేకాదు, ప్రత్యర్థి బ్యాటర్లకు ఎక్కువగా పరుగులు ఇచ్చేస్తున్నాడు. ముంబయి ఇండియన్స్ ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా, బుమ్రా ఐపీఎల్‌లో గత ఐదు ఇన్నింగ్స్‌లుగా వికెట్ తీసుకోలేకపోవడం గమనార్హం.

వివరాలు

వికెట్లు తీయడంలో విఫలం..

గత సీజన్‌లో అహ్మదాబాద్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 40 పరుగులు ఇచ్చాడు. ఈ సీజన్‌లో వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 35 పరుగులు, ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 21 పరుగులు, గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 ఓవర్లలో 32 పరుగులు, అలాగే వాంఖడేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చాడు. ఈ విధంగా గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 19 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 163 పరుగులు సమర్పించాడు.

వివరాలు

యార్కర్ల వినియోగం తగ్గిందా?

క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బుమ్రా తన ప్రధాన ఆయుధమైన యార్కర్లను సమర్థవంతంగా వినియోగించడం లేదు. వికెట్లు తీయాలనే ఒత్తిడితో అతను ఎక్కువగా పరుగులు ఇస్తున్నాడని వారు విశ్లేషిస్తున్నారు. వికెట్ల కోసం మాత్రమే ప్రయత్నించకుండా, బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. బుమ్రా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వకపోవడం, వికెట్లు తీసుకోలేకపోవడం ముంబయి ఇండియన్స్ విజయావకాశాలను ప్రభావితం చేస్తోందని మాజీ భారత క్రికెటర్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌లో ఇంకా అనేక మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో, ఇకపై బుమ్రా తిరిగి ఫామ్‌లోకి వచ్చి తనదైన శైలిలో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement