
Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌కి బుమ్రా ఔట్? సిరాజ్-ఆకాశ్‌దీప్ జోడీ రీ ఎంట్రీ!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో టెస్టు టీమిండియా (India vs England)కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తేనే సిరీస్‌ను సమం చేసే అవకాశాన్ని భారత్ పొందుతుంది. అయితే కోచింగ్ స్టాఫ్ పేసర్లు ఫిట్‌గా ఉన్నారని చెప్పిన వెంటనే ఓ షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఆఖరి టెస్టు నుంచి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. బుమ్రాకు విశ్రాంతి అవసరమని బీసీసీఐ వైద్య బృందం సలహా ఇవ్వడంతో, అతడిని తుది జట్టులో నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
Details
మళ్లీ ఆ జోడీ బరిలోకి
నాలుగో టెస్టు ముందు ఆకాశ్‌దీప్ గాయపడిన సంగతి తెలిసిందే. అర్ష్‌దీప్ సింగ్‌కు ఇప్పటివరకు టెస్టుల్లో అరంగేట్రం అవకాశం రాలేదు. కానీ ఐదో టెస్టులో మాత్రం అతడి డెబ్యూ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్షుల్ కాంబోజ్ స్థానంలో అర్ష్‌దీప్‌కు చోటు దక్కేలా కనిపిస్తోంది. మరోవైపు బుమ్రాకు బదులుగా తిరిగి ఫిట్ అయిన ఆకాశ్‌దీప్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్‌లోనూ తప్పకుండా బరిలోకి దిగనున్నారు. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో మెరిసిన సిరాజ్ - ఆకాశ్‌దీప్ జోడీ మళ్లీ ఇంగ్లాండ్‌ను ఎదుర్కొనబోతోంది. ఎడమచేతివాటం పేసర్ అర్ష్‌దీప్ తన డెబ్యూ మ్యాచ్‌లోనే మంచి ప్రదర్శన ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
Details
స్పెషలిస్ట్ స్పిన్నర్‌కు అవకాశమా?
మాంచెస్టర్ టెస్టులో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా బాగా రాణించారు. చివరి మ్యాచ్‌లోనూ ఈ కాంబినేషన్ కొనసాగేలా కనిపిస్తోంది. అయితే, రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన కుల్‌దీప్ యాదవ్‌కు ఆఖరి టెస్టులో అవకాశమిస్తారా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉండటంతో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం కష్టమే. అయినా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేకపోవడం వల్ల అతడి స్థానంలో చైనామన్ బౌలర్ అయిన కుల్‌దీప్‌కు ఛాన్స్ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది.
Details
బ్యాటింగ్‌లో మార్పులు తక్కువే?
బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే, పెద్దగా మార్పులు ఉండేలా కనిపించడం లేదు. మాంచెస్టర్ టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన సాయి సుదర్శన్‌కు మరోసారి అవకాశం దక్కేలా ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్ అయినా, అతడి ప్రదర్శన మేనేజ్‌మెంట్‌కి నచ్చినట్లు తెలుస్తోంది. వికెట్‌కీపర్ రిషబ్ పంత్ ఇప్పటికే సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఎన్టీ జగదీశన్‌కు తుది జట్టులో అవకాశం దక్కుతుందా? లేదాధ్రువ్ జురేల్‌ను బ్యాకప్‌గా వినియోగిస్తారా? అనేదే ఆసక్తికరంగా మారింది. అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే ధ్రువ్‌కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వదేశం నుంచి వచ్చి వాతావరణానికి అలవాటు పడలేని అనుభవాన్ని అన్షుల్ కాంబోజ్ ఎదుర్కొన్న నేపథ్యంలో, మేనేజ్‌మెంట్ ఈసారి ఇలాంటి పొరపాటు జరగనివ్వకూడదనే ఒత్తిడిలో ఉంది.