Page Loader
IND vs ENG 2nd Test: బుమ్రా ఔట్.. గిల్-గంభీర్ సూపర్ ప్లాన్.. రెండో టెస్టులో షాకింగ్ ఎంట్రీ?
బుమ్రా ఔట్.. గిల్-గంభీర్ సూపర్ ప్లాన్.. రెండో టెస్టులో షాకింగ్ ఎంట్రీ?

IND vs ENG 2nd Test: బుమ్రా ఔట్.. గిల్-గంభీర్ సూపర్ ప్లాన్.. రెండో టెస్టులో షాకింగ్ ఎంట్రీ?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 01, 2025
02:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్ తొలి టెస్టులో ఓటమి చెందింది. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించినా, బౌలింగ్ విభాగం తలమానికంలా పడిపోయింది. ప్రధాన పేసర్ జస్పిత్ బుమ్రా తప్ప మరెవ్వరూ సమర్ధవంతంగా బౌలింగ్ చేయలేకపోయారు. దీంతో జూలై 2న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభమయ్యే రెండో టెస్టులో జట్టు కూర్పులో మార్పులు తప్పవన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బుమ్రా స్థానంపై చర్చలు చురుకుగా సాగుతున్నాయి.

Details

బుమ్రాకు విశ్రాంతి ఎందుకు?

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యల ప్రకారం, బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే పాల్గొంటాడు. పని భారం పెరగకుండా చూసే ఉద్దేశంతో జట్టు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరుసగా గాయాల బారినపడిన బుమ్రా, తొలి టెస్టులో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఫిట్‌నెస్ దృష్ట్యా రెండో టెస్టుకు అతనికి విశ్రాంతినివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడో టెస్టులో తిరిగి అతను బరిలోకి దిగే అవకాశం ఉంది.

Details

బుమ్రా స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?

ప్రస్తుతం బుమ్రా స్థానాన్ని భర్తీ చేయాలంటే టీమ్‌ఇండియాకి రెండు ప్రధాన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో ఇప్పటివరకు ఆడకపోయినా, ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌లో అనుభవం ఉంది. ఇది అతనికి అనుకూలంగా ఉండవచ్చు. ఆకాశ్ దీప్ టెస్టుల్లో ఇప్పటికే అరంగేట్రం చేసిన ఆకాశ్, మంచి ఫస్ట్ క్లాస్ ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాడు. ఏడుగురితో కూడిన మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది కెప్టెన్ శుభమన్ గిల్, కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Details

జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది

తొలి టెస్టులో ఓటమితో భారత్ సిరీస్‌లో వెనుకబడింది. రెండో టెస్టులో విజయం సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో బుమ్రా లాంటి కీలక బౌలర్ లేకపోవడం టీమిండియాకు పెద్ద లోటే. అయితే, మిగిలిన బౌలర్లు తమ బాధ్యతను నిర్వర్తించి ఇంగ్లండ్‌ను కట్టడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Details

కుల్దీప్ యాదవ్‌కు అవకాశం?

ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో, కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మొదటి టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ ఆకట్టుకోలేకపోవడంతో, బౌలింగ్ లైన్‌ప్లో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. జూలై 2న ప్రారంభమయ్యే రెండో టెస్టులో భారత్ ఎలా పోటీ ఇస్తుందో, బుమ్రా స్థానంలో ఎవరు బరిలోకి దిగుతారో అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి.