Jasprit Bumrah: టీమిండియా కెప్టెన్లపై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా పేసర్ జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బీసీసీఐ అతడిపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా, సమయం చిక్కినప్పుడల్లా విశ్రాంతిని ఇస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు భారత్‌కు బుమ్రా ఎంత ముఖ్యమైన బౌలరో అని. 2016లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి బుమ్రా అడుగుపెట్టారు. అతను ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఎన్నో ఇన్నింగ్స్ లను ఆడాడు. ఈ సందర్భంగా వారి గురించి బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంఎస్ ధోని జట్టులో చోటు విషయంలో చాలా భద్రత కల్పించాడని, పెద్ద, పెద్ద ప్రణాళికలను అంతా నమ్మడని బుమ్రా పేర్కొన్నాడు.
ఆటగాళ్ల భావోద్వేగాలను రోహిత్ ఆర్థం చేసుకుంటాడు
ఇక విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ పరంగా ప్రోత్సహిస్తాడని, అంకితభావంతో పనిచేస్తాడని చెప్పారు. ఫిట్ నెస్ విషయంలో జట్టు తీరుని మార్చాడన్నారు. రోహిత్ శర్మ బ్యాటర్ అయినప్పటికీ బౌలర్ల పట్ల సానుభూతి చూపుతాడని మెచ్చుకున్నారు. ఆటగాళ్ల భావోద్వేగాలను రోహిత్ ఆర్థం చేసుకుంటాడని, ఆటగాళ్లను ఎప్పుడూ ఫీడ్ బ్యాక్ ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని బుమ్రా వెల్లడించారు. బుమ్రా ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్ లలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడుతుండగా, ఇక టీ20లలో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో ఆడుతున్నాడు.