LOADING...
Jasprit Bumrah: మెల్‌బోర్న్ టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా రికార్డు
మెల్‌బోర్న్ టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా రికార్డు

Jasprit Bumrah: మెల్‌బోర్న్ టెస్టులో చరిత్ర సృష్టించిన బుమ్రా..తొలి భారత బౌలర్‌గా రికార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 29, 2024
09:37 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా పర్యటనలో భారత బౌలర్ జస్పిత్ బుమ్రా అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య బ్యాటర్లను గడగడలాడిస్తున్నాడు. మెల్‌బోర్న్‌ టెస్టులోనూ ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తూ తన బౌలింగ్‌తో ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనతను సాధించాడు. అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని అందుకున్న భారత బౌలర్‌గా బుమ్రా నిలిచాడు. దీంతో ఓవరాల్‌గా నాలుగో పేసర్‌గా పేరు పొందడం విశేషం. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత బుమ్రా ఈ రికార్డును సాధించాడు.

Details

అగ్రస్థానంలో అశ్విన్

44వ టెస్టులో ఈ ఘనతను అందుకున్న బుమ్రా కేవలం 8,484 బంతుల్లో 200 వికెట్ల మార్క్‌ను చేరుకున్నాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతుల్లో ఈ మైలురాయిని చేరి అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో దక్షిణాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్ (7,848 బంతులు), కగిసో రబాడ (8,153 బంతులు) ఉన్నారు. అయితే టెస్టుల సంఖ్య పరంగా చూస్తే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (37 మ్యాచులు) ఈ జాబితాలో భారత్‌ తరఫున అగ్రస్థానంలో ఉన్నాడు.