Page Loader
బుండెస్లిగా లీగ్‌లో టాప్-5 స్ట్రైకర్లు వీరే!
కోలో మువానీ గత సీజన్‌లో ఫ్రాంక్‌ఫర్ట్ తరపున 15 గోల్స్ చేశాడు

బుండెస్లిగా లీగ్‌లో టాప్-5 స్ట్రైకర్లు వీరే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 16, 2023
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

కొద్ది సంవత్సరాలుగా బుండెస్లిగా లీగ్‌ స్ట్రైకర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ లీగ్‌లోక్రమ క్రమంగా ఆటగాళ్లు ఎదుగుతూ తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు. హ్యారీ కేన్ బేయర్న్ మ్యూనిచ్‌లో చేరడంతో అందరి దృష్టి ఈ లీగ్ పై పడింది. ప్రస్తుతం ఈ లీగ్‌లోని టాప్-5 స్ట్రైకర్ల గురించి తెలుసుకుందాం విక్టర్ బోనిఫేస్, బేయర్ లెవర్కుసెన్ విక్టర్ బోనిఫేస్ బోనిఫేస్ జూపిలర్ ప్రోలీగ్‌లో 37 మ్యాచ్‌లు ఆడి, తొమ్మిది గోల్స్ చేసి, ఎనిమిది అసిస్ట్ లను సంపాదించాడు. యూరోపా లీగ్‌లో కూడా ఆరు గోల్స్‌తో సత్తా చాటాడు, రాండాల్ కోలో మువానీ ప్రపంచంలోని యువ స్ట్రైకర్‌లలో రాండల్ కోలో మువాని ఒకడు. గత బుండెస్లిగా లీగ్‌లో 15 గోల్స్ చేసి 11 అసిస్ట్‌లను సాధించాడు.

Details

ఈ తరం గొప్ప స్ట్రైకర్ లలో హ్యారీకేన్ ఒకరు

నిక్లాస్ ఫుల్‌క్రుగ్, వెర్డర్ బ్రెమెన్ బుండెస్లిగా లీగ్ గత సీజన్‌లో ఉమ్మడి అత్యధిక స్కోర్ సాధించిన నిక్లాస్ ఫుల్‌క్రుగ్ ఈసారి వెర్డర్ బ్రెమెన్‌ తరుపున ఆడటానికి సిద్ధమయ్యాడు. గత సీజన్‌లో 28 మ్యాచ్‌లు ఆడి 16 గోల్స్ చేశాడు. లోయిస్ ఓపెన్డా, RB లీప్జిగ్ లోయిస్ ఓపెన్డా గత సీజన్‌లో 21 గోల్స్ సాధించి, నాలుగు అసిస్ట్‌లను అందించాడు. 23 ఏళ్ల అతను తన అద్భుతమైన అటాకింగ్‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టగలడు. హ్యారీ కేన్, బేయర్న్ మ్యూనిచ్ ఈ తరం గొప్ప స్ట్రైకర్‌లలో హ్యారీకేన్ ఒకరు. గత సీజన్ ప్రీమియర్ లీగ్‌లో 30 గోల్స్ చేశాడు. స్పర్స్ కోసం 435 మ్యాచ్‌లలో 280 గోల్స్ చేసి, 60 అసిస్ట్‌లను సాధించాడు.