లా లిగా 2023-24: టాప్ ప్లేయర్లను దక్కించుకున్న ప్రాంచైజీలు
ఈ వార్తాకథనం ఏంటి
లా లిగా 2023-24 సీజన్ ఈసారి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఆగస్ట్ 11న మొదటి మ్యాచులో అల్మెరియాతో రేయో వల్లేకానోతో పోటీ పడనుంది.
ఈ సీజన్‌లో పలువురు టాప్ ప్లేయర్లను కొన్ని ప్రాంచెజీలు దక్కించుకున్నాయి.
కాగ్లర్ సోయుంకు, అట్లెటికో మాడ్రిడ్
టుకే ఇంటర్నేషనల్ కాగ్లర్ సోయుంకు లీసెస్టర్ సిటీ నుండి నిష్క్రమించిన తరువాత అట్లెటికో మాడ్రిడ్ ప్రాంచెజీతో నాలుగు సంవత్సరాల పాటు ఆడనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అతను జర్మన్ సైడ్ ఫ్రీబర్గ్ నుండి ఫాక్స్‌లో చేరిన తర్వాత 132 గేమ్‌లు ఆడాడు. 2021లో లీసెస్టర్ FA కప్, కమ్యూనిటీ షీల్డ్‌ను గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు.
Details
సోసిడాడ్‌లో చేరిన ఆండ్రీ సిల్వా
జూడ్ బెల్లింగ్‌హామ్, రియల్ మాడ్రిడ్
బెల్లింగ్‌హామ్ రియల్ మాడ్రిడ్‌లో చేరాడు. రియల్ మాడ్రిడ్ ఎక్కువ ధరకు బెల్లింగ్‌హమ్‌ను దక్కించుకుంది. బెల్లింగ్‌హామ్ డార్ట్‌మండ్ తరపున 132 మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది.
సీజర్ అజ్పిలిక్యూటా, అట్లెటికో మాడ్రిడ్
చెల్సియాలో 11 సీజన్ల తర్వాత, సీజర్ అజ్పిలిక్యూటా అట్లెటికో మాడ్రిడ్‌లో చేరడానికి లా లిగాకు తిరిగి వచ్చాడు. అజ్పిలిక్యూటాకు అనుభవంతో పాటు, నాయకత్వ లక్షణాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. అతను చెల్సియా తరపున 508 మ్యాచ్‌ల్లో 17 గోల్స్ చేశాడు.
ఆండ్రీ సిల్వా, రియల్ సొసైడాడ్
ఆండ్రీ సిల్వా రియల్ సోసిడాడ్‌లో చేరాడు. 95 మ్యాచుల్లో 26 గోల్స్ చేశాడు. సిల్వా ఫ్రాంక్‌ఫర్ట్ కోసం 71 గేమ్‌లలో 45 గోల్స్ చేసి సత్తా చాటాడు.