T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో అత్యధిక రన్ లు చేసిన కెప్టెన్లు వీరే..
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొమ్మిది ఎడిషన్లలో ఎన్నో అద్భుత ప్రదర్శనలు చూసే అవకాశం లభించింది. T20 క్రికెట్‌లో ఆటగాళ్ల ప్రభావం ముఖ్యం అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో కెప్టెన్లు కూడా తమ బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మలుపు తిప్పారు. అయితే, ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో ఏ కెప్టెన్ కూడా సెంచరీ సాధించలేదు.
#1
క్రిస్ గేల్: 98 vs ఇండియా, బ్రిజ్‌టౌన్, 2010
వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ T20 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడు. 2010 ఎడిషన్‌లో బ్రిజ్‌టౌన్‌లోని 19వ మ్యాచ్‌లో ఆయన భారత్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 98 రన్లు సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. గేల్ సెంచరీకి రెండుపరుగుల దూరంలో రన్ అవుట్ అయ్యాడు. అతని ప్రదర్శన వల్ల కరిబియన్ జట్టు 169/6 స్కోర్ చేసింది, అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్‌ను 155/9 స్కోరుకే పరిమితం చేసింది.
#2
రోహిత్ శర్మ: 92 vs ఆస్ట్రేలియా, గ్రాస్ ఇస్లెట్, 2024
2024లో, భారత కెప్టెన్ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్‌లో 90 పైగా స్కోరు సాధించిన రెండో కెప్టెన్ అయ్యాడు. 41 బంతుల్లో 92 రన్ల అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆయన 2024 సూపర్ 8 మ్యాచ్‌లో భారత్‌ను ఆస్ట్రేలియాపై విజయం సాధించడంలో కీలక భూమిక పోషించాడు. రోహిత్ పవర్ ప్లేలో ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ పేసర్లను ఓ అట ఆడుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 7 ఫోర్లు, 8 సిక్సులు కొట్టాడు.
#3
కేన్ విలియమ్సన్: 85 vs ఆస్ట్రేలియా, దుబాయ్, 2021 ఫైనల్
2021 T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున మెరిసాడు. దుబాయ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌లో కీవి కెప్టెన్ 48 బంతుల్లో 85 రన్లు (10 ఫోర్లు, 3 సిక్సులు) చేశాడు. ఇది ఇప్పటివరకు T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. విలియమ్సన్ ఇన్నింగ్స్ న్యూజిలాండ్‌ను 172/4 వరకు తీసుకెళ్లింది, కానీ ఆస్ట్రేలియా చివరికి విజయాన్ని సాధించి వారి మొదటి T20 వరల్డ్ కప్ టైటిల్ ను గెలుచుకుంది.