Sunrisers Hyderabad: కార్స్ ఔట్.. కమిన్స్ ఇన్.. సన్‌రైజర్స్ జట్టుకు భారీ ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
సన్ రైజర్స్ హైదరబాద్ జట్టు ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసి ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. అయితే ఈ నెల 18న ఉప్పల్ వేదికగా చెన్నైతో జరగనున్న కీలక మ్యాచ్‌కు ముందు జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జట్టుకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్, రెండు గుడ్ న్యూస్‌లు వెలుగులోకి వచ్చాయి. కార్స్ ఔట్.. జట్టుకు షాక్ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో కుడి చేతికి గాయపడడంతో అతను ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇది సన్‌రైజర్స్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది.
వివరాలు
మధుశంక ఎంట్రీ
కార్స్ స్థానంలో శ్రీలంక యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంకను జట్టులోకి తీసుకున్నారు. రూ. 75 లక్షలతో అతన్ని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కొనుగోలు చేసింది. స్వింగ్ బౌలింగ్‌లో నైపుణ్యం ఉన్న మధుశంక రాకతో బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది. కమిన్స్ రీఎంట్రీతో ఊరట ఫిట్‌నెస్ సమస్యల కారణంగా తొలి దశ మ్యాచ్‌లకు దూరమైన జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరనున్నాడు. ఆస్ట్రేలియాలో ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసిన కమిన్స్, ఈ నెల 25న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇటీవల రాజస్థాన్‌పై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్, ఇకపై కమిన్స్ నాయకత్వంలో మధుశంక వంటి బౌలర్ల సహకారంతో ఇదే జోరును కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.